Begin typing your search above and press return to search.
దాడులపై ప్రధానికి కేసీఆర్ లేఖ
By: Tupaki Desk | 19 March 2017 5:33 AM GMTఏదైనా జరిగిన వెంటనే స్పందించటం ఒక పద్ధతి. కానీ.. నష్టం జరిగిపోయిన ఆర్నెల్లకు నిద్ర లేచి దానిపై చర్యలు తీసుకోవాలనటంలో అర్థం ఉండదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇంచుమించు ఇదే తీరులో ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో ట్రంప్ అమెరికా అద్యక్షుడు అయ్యాక.. ప్రవాస భారతీయుల మీద దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ మధ్యన జాతివివక్షతో కాల్పులు జరిపిన ఘటనలో హైదరాబాద్ కు చెదిన కూఛిబొట్ల శ్రీనివాస్.. వరంగల్ జిల్లాకు చెందిన మామిడాల వంశీచందర్ రెడ్డిలు హత్యకు గురి కావటం తెలిసిందే. ఈ ఉదంతంపై ప్రజలు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. అమెరికాలో ఉన్న మనోళ్ల క్షేమం గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలని.. జరిగిన ఘటనలపై కేంద్రం స్పందించి.. అమెరికా దృష్టికి తీసుకెళ్లాలంటూ డిమాండ్లు వ్యక్తమయ్యయి.
అప్పుడీ అంశాల మీద స్పందించని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా.. ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. అమెరికాలో ప్రవాస భారతీయులపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయటమే కాదు.. కేంద్రం అప్రమత్తమై.. పరిస్థితుల్ని చక్కదిద్దేలా చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాయటం గమనార్హం. ప్రధాని మోడీకి రాసిన లేఖలో.. ఇటీవల జరిగిన విషాద ఉదంతాలగురించి ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అమెరికాలో ఉన్న తమ వారి యోగక్షేమాల గురించి.. వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని.. అమెరికాపై వారి విశ్వాసం సడలుతుందన్న ఆందోళనను వ్యక్తం చేశారు.
అయినా.. అప్పడెప్పుడో జరిగినన కాల్పుల ఉదంతాలపై ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేయటం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ అంశాల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి తీసుకెళ్లి.. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనకర పరిణమాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలంటూ ప్రధానిని ముఖ్యమంత్రి కోరారు. ఉన్నట్లుండి.. ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ రాయటం ఏమిటి? ఇప్పటి వరకూ తెలుగు వారి ఆందోళన కేసీఆర్ దృష్టికి రాలేదా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/