Begin typing your search above and press return to search.
ఏం మోడీ... నేనేమైనా చంద్రబాబునా? - కేసీఆర్
By: Tupaki Desk | 27 Nov 2018 3:36 PM GMTమోడీ నువ్వు ప్రధానివి. ఆ పోస్టుకు ఎంతో గౌరవం ఉంది. ఆ పదవిలో ఉండి అబద్ధాలు ఎలా మాట్లాడుతావు. తెలంగాణలో కరెంటు లేదంటావు... ఇక్కడి నుంచి ఇటే వస్తా నిజామాబాద్‌కు. 24 గంటల కరెంటు ఏ ఊరికి లేదో మోడీ చెప్పాలి. నీవు మాట్లాడితే భయపడటానికి నేను ఏమైనా చంద్రబాబునా? తెలంగాణ బిడ్డ కేసీఆర్ ఇక్కడ. గడబిడలు కుదరవు. నీకు అర్థం కావాలని ఇంగ్లిష్‌లో చెబుతున్నా అంటూ ఇంగ్లిష్‌లోనే మోడీని నిలదీశారు కేసీఆర్.
నల్గొండ జిల్లాలోని హాలియాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన కేసీఆర్ మోడీకి గట్టి సవాల్ విసిరారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నువ్వు చెప్పిన అబద్ధాలు నిరూపించు అన్నారు. తప్పు చేయని వాడు ఎవ్వరికీ భయపడడు. నేనంతే.
‘ఎన్నికలు ప్రజలకు వచ్చిన ఓ అవకాశం. దాన్ని వృథా చేసుకోకూడదు. అందరి మాటలు విని చర్చించి సరైన అభ్యర్థికి ఓటెయ్యండి అన్నారు. తెలంగాణను ఆగం చేసిన టీడీపీ, కాంగ్రెస్‌లు ఒకవైపు ఉన్నాయి. వాళ్లు 70 ఏళ్లలో ఏం చేశారో ఆలోచించండి. నాలుగేళ్లలో టీఆర్ఎస్ ఏం చేసిందో అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోండి అన్నారు.
2014లో టీఆర్ఎస్ గెలిచాక ప్రధాని నరేంద్ర మోడీ- చంద్రబాబు కలిసి కుట్రలు చేశారు. ఆ బాబు ఎలాంటోడో ఆయనకు ఇపుడు అర్థమైంది. అసదుద్దీన్ ఓవైసీ బాబు-మోడీ కుట్ర గురించి చెప్పారు. అలెర్ట్ అయ్యాను. లేకపోతే అపుడే మా ప్రభుత్వాన్ని కూల్చి వేసేవారు అని కేసీఆర్ వెల్లడించారు. కేసీఆర్ ముక్కుసూటిగా ఉంటాడు. మాటంటే మాటే. మీ కుట్రు గట్టిగా ఎదుర్కొన్నాం, నిలబడి అభివృద్ధి చేసుకున్నాం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.