Begin typing your search above and press return to search.
ఫ్యామిలీ ట్రిప్పా.. ఫెడరల్ ట్రిప్పా సారూ?
By: Tupaki Desk | 7 May 2019 6:12 AM GMTకొందరి విషయంలో ప్రతిది చర్చగా మారి.. రచ్చ అవుతుంటుంది. అదే సమయంలో మరికొందరి విషయంలో చాలా అంశాలు అస్సలు చర్చకే రావు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విషయాన్నే తీసుకోండి. ఆయనకు సంబంధించిన ఏ అంశం చర్చకే రావు. తాజాగా ఆయన కేరళ ట్రిప్పునే తీసుకుంటే.. అది అధికారిక పర్యటనో.. అనధికార పర్యటనా? అన్న విషయంపై క్లారిటీ లేదు.
కేరళ ముఖ్యమంత్రితో భేటీ కావటం..కొన్ని దేవాలయాల్ని సందర్శించటం లాంటివి కేసీఆర్ చేశారు. కేసీఆర్ వెంట.. ఆయన సతీమణితోపాటు.. మనమళ్లు.. మనమరాళ్లు కూడా ఉన్నారు. కేసీఆర్ తో పాటు.. రాజ్యసభ సభ్యుడు.. ఆయన కుటుంబ సభ్యుడిలో ఒకరుగా చెప్పే సంతోష్ కుమార్.. కొందరు పార్టీ నేతలు ఉన్నారు.
వేసవి విడిది కోసం కేరళ వెళుతున్నట్లు చెప్పినా.. కేసీఆర్ ప్రోగ్రాం చూస్తే.. ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తో రాజకీయ చర్చలు జరపటమే కాదు.. ఫెడరల్ ఫ్రంట్ కు అనుగుణంగా పావులు కదపటం తెలిసిందే. తెలంగాణలో ఏ మాత్రం లెక్క చేయని వామపక్షాలకు చెందిన నేతతో కేసీఆర్ చర్చలు జరపటం విశేషం.
అదే సమయంలో రెండు దేవాలయాలకు వెళ్లిన ఆయన.. భార్యతో పాటు.. మనమళ్లు.. మనమరాళ్లను వెంటపెట్టుకు వెళ్లటం చూస్తే.. కేరళ ట్రిప్పు మొత్తం పక్కాగా పర్సనల్ ట్రిప్పుగా చెప్పక తప్పదు. మరి.. స్పెషల్ ప్లైట్.. మిగిలిన వాటికి పెట్టిన ఖర్చు సారు సొంత అకౌంట్ నుంచి ఖర్చు చేస్తున్నారా? లేక..తెలంగాణ ఖజానా నుంచి వాడేస్తున్నారా?