Begin typing your search above and press return to search.
ఫెడరల్ ట్రిప్ కాస్తా టెంపుల్ ట్రిప్ అయ్యిందిగా!
By: Tupaki Desk | 11 May 2019 4:49 AM GMTరోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. తాజాగా ఆయన అదే తీరును మరోసారి ప్రదర్శించారని చెప్పాలి. కేరళ జర్నీని ఫెడరల్ ట్రిప్ గా అభివర్ణించి.. ఆ తర్వాత దాన్ని టెంపుల్ ట్రిప్ గా కన్వర్ట్ చేయటం కేసీఆర్ తెలివికి నిదర్శనంగా చెప్పక తప్పదు. కేరళకు పార్టీ నేతలతో పాటు.. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన కేసీఆర్.. తర్వాత పార్టీ నేతల్ని వెనక్కి పంపేశారు.
కుటుంబ సభ్యులతో కలిసి.. కేరళలోని కొన్ని దేవాలయాలు సందర్శించిన ఆయన.. తర్వాత తన ప్రయాణాన్ని తమిళనాడుకు పెట్టుకున్నారు. అక్కడ బోలెడన్ని గుళ్లను సందర్శించిన ఆయన చాలానే పూజలు చేయించారని చెప్పక తప్పదు. తొలుత ప్రచారం జరిగిన ఫెడరల్ ఫ్రంట్ ట్రిప్ పక్కకు వెళ్లిపోయి.. తాజా టూర్ టెంపుల్ ట్రిప్ గా మారిందన్న మాట వినిపిస్తోంది.
కేరళ ముఖ్యమంత్రితో భేటీ కావటం.. ఆ వెంటనే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఫోన్లో మాట్లాడటం.. ఇంకేముంది? డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ కావటంతో ఫెడరల్ ఫ్రంట్ వ్యవహారం ఒక షేప్ కు వస్తుందని భావించినా.. ఎంత వేగంగా ఫెడరల్ హైప్ క్రియేట్ అయ్యిందో.. అదే వేగంగా ఆ విషయాన్ని ప్రస్తావించని పరిస్థితి నెలకొంది.
కామ్రేడ్ పెద్దలతో విజయన్ ను మాట్లాడమన్న కేసీఆర్.. కేరళ సీఎంతో మీటింగ్ తర్వాత నుంచి ఫెడరల్ ఫ్రంట్ మాట మీడియాలో రాకపోవటం గమనార్హం. కేరళ సీఎంను కలిసేంతవరకూ ఆయన ట్రిప్ మీద బోలెడన్ని విశ్లేషణలు వినిపించాయి. అందుకు భిన్నంగా సార్ ట్రిప్ మారిందని చెప్పాలి. ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించిన కేసీఆర్ వేసుకున్న ఈక్వేషన్స్ వర్క్ వుట్ కాకపోవటమే కాదు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడటానికి ఎవరూ ఆసక్తి చూపకపోవటంతో.. కేసీఆర్ ప్లాన్ బిలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.
ఎలాంటి పరిస్థితుల్లో అయినా తనకు తగినట్లుగా తెలుగు మీడియాను డ్రైవ్ చేసే శక్తి ఉన్న కేసీఆర్.. తాజాగా ఆ చతురతను ప్రదర్శించారని చెప్పాలి. కేరళ ట్రిప్ కు కేసీఆర్ పయనమయ్యే నాటికి తెలుగు మీడియాలో ఇంటర్ బోర్డు ఫెయిల్యూర్.. ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం మీద హాట్ హాట్ గా న్యూస్ వస్తున్న పరిస్థితి. దాని నుంచి బయటపడేసి.. కేసీఆర్ వారి ఫెడరల్ ఫ్రంట్ మీద ఆసక్తి చూపించేలా కేసీఆర్ కేరళ ట్రిప్ మారింది.
ఫెడరల్ ఫ్రంట్ ప్రయాణంపై కేసీఆర్ టూర్ స్టార్ట్ అయిన రెండు రోజులకే మీడియాకు ఒక క్లారిటీ వచ్చేలా చేశారు కేసీఆర్. దీంతో.. ఇంటర్ ఇష్యూ.. కేసీఆర్ ఫెడరల్ ఎపిసోడ్ పక్కకు వెళ్లిపోయాయి. చివరకు ఏదో జరిగిపోతుందన్న భావనను కలిగించిన కేసీఆర్ కేరళ టూర్ తాజాగా టెంపుల్ ట్రిప్ గా మిగిలిందని చెప్పక తప్పదు.