Begin typing your search above and press return to search.
బీజేపీని కాంగ్రెస్ తో కొడుతున్న కేసీఆర్!
By: Tupaki Desk | 14 July 2020 5:32 PM GMTశత్రువుకి శత్రువు మిత్రుడు అన్నది ఏనాటి నుంచో ఉంది. ఇప్పుడు అదే స్ట్రాటజీని గులాబీ బాస్ కేసీఆర్ బీజేపీపై ప్రయోగిస్తున్నారట.. తెలంగాణపై దూకుడుగా వెళ్తున్న కమలదళానికి కాంగ్రెస్ తో చెక్ చెప్పే వ్యూహాన్ని తెరపైకి తెచ్చాడట.. బీజేపీని కాంగ్రెస్ తో కొడుతూ కాంగ్రెస్ చెవిలో వెర్రి గులాబీ పుష్పాలు పెడుతున్నాడట కేసీఆర్. ఇప్పుడీ చర్చ టీఆర్ఎస్ ముఖ్యుల్లో సాగుతోంది.
కేంద్రంలో అధికారంలో ఉండడం.. దూకుడైన బండి సంజయ్ పగ్గాలు చేపట్టడంతో బీజేపీ నలువైపులా కేసీఆర్ సర్కార్ పై యుద్ధం చేస్తోంది. తక్కువ టెస్టులు.. అధ్వాన ప్రభుత్వ ఆసుపత్రులు.. కేసీఆర్ పాలనపై గవర్నర్ తమిళ్ సైని దించి మరీ టీఆర్ఎస్ సర్కార్ ను బీజేపీ ఇరుకునప పెడుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ కంటే కాంగ్రెస్సే మేలు అని కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడం కంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తో ఫైట్ చేయడం చాలా ఈజీ అని ఆలోచిస్తున్నట్టు పరిణామాలు గమనిస్తే బోధపడుతోంది.
అందుకే ఇప్పుడు కేసీఆర్, మంత్రులు.. అధికార పార్టీ నేతలు బీజేపీ విమర్శలపై పెద్దగా స్పందించడం లేదు. వ్యూహాత్మక మౌనం వహిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ పైనే ఘాటుగా స్పందిస్తున్నారు. పరోక్షంగా బీజేపీని కావాలనే సైడ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సేనని.. బీజేపీ కానే కాదన్న సిగ్నల్ ఇస్తూ కమలదళాన్ని మానసికంగా దెబ్బతీసే వ్యూహాన్ని కేసీఆర్ తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
అందుకే తాజాగా కరోనా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలు, ధర్నాలను సులువుగా పర్మిషన్లు ఇస్తోందట టీఆర్ఎస్ సర్కార్. అంతకుముందు అస్సలు అనుమతి ఇవ్వని కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ ఆందోళనలకు అధికారులు ఆటంకం కలిగించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.
కాంగ్రెస్ ఎంత దూకుడుగా వెళ్లినా ఆ పార్టీని ఎన్నికల్లో ఓడించడం సులభమనేది కేసీఆర్ స్ట్రాటజీ. అదే బీజేపీని హైలెట్ చేస్తే మొదటికే మోసం వస్తుందని.. అందుకే బీజేపీని అస్సలు గులాబీ దళం పట్టించుకోవడం లేదట.. ఇలా బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ నే ఆయుధంగా మలిచి ఆ పార్టీని దెబ్బతీసే ప్లాన్ వేశారట గులాబీ దళపతి. ఎంతైనా కేసీఆర్ ది బుర్రే బుర్రే..