Begin typing your search above and press return to search.
కేసీఆర్ - జగన్ లతో సహా ప్రధాని కీలక భేటి
By: Tupaki Desk | 20 Sep 2020 7:15 AM GMTదేశంలో కరోనా పట్టపగ్గాలు లేకుండా విస్తరిస్తోంది. రోజుకు లక్ష చొప్పు కేసులు నమోదవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ పెట్టిన మోడీ ఇప్పుడు అన్నింటిని వదిలేశాడు. జనాలు కూడా కరోనాను లైట్ తీసుకున్నారు. దీంతో కేసుల సంఖ్య దేశంలో రోజుకు లక్షకు తగ్గడం లేదు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కరోనాతో కిటకిటలాడుతున్నాయి.
ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ కీలక భేటికి రెడీ అవుతున్నారు. దేశంలో అత్యంత తీవ్రంగా కరోనా ప్రబలుతున్న 10 రాష్ట్రాల సీఎంలతో భేటికి మోడీ నిర్ణయించారు. ఈ భేటి ఈనెల 23న ఉంటుందని సమాచారం. మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వైరస్ స్థితిగతులపై ఆరా తీయనున్నారు.
ఈ కీలక భేటికి ఏపీ - తెలంగాణ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్ - జగన్ లతోపాటు తమిళనాడు - కర్ణాటక - పశ్చిమ బెంగాల్- మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్ - ఢిల్లీ ముఖ్యమంత్రులు ఇందులో పాల్గొంటారని సమాచారం.
ఈ క్రమంలోనే కరోనా నియంత్రణపై మోడీ సర్కార్ కీలక నిర్ణయాలతోపాటు సినిమా రంగం సహా పలు రంగాల ఓపెనింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని సమాచారం. కేంద్రం అమలు చేస్తున్న కోవిడ్ మార్గదర్శకాల మార్పులు.. కరోనా రోగులకు చికిత్స, పౌష్టికాహారం, కోవిడ్ సెంటర్ల వైద్య సదుపాయాల గురించి మోడీ కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.
కరోనా కట్టడిలో విఫలమవుతున్న సీఎంలతో మోడీ కాస్త గట్టిగానే హెచ్చరికలు చేస్తారని.. ఈసారి సాయం పై కూడా ప్రకటన చేస్తారని అంటున్నారు.