Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ పై మోడీ.. కసీఆర్.. జగన్ మాట ఒక్కటే

By:  Tupaki Desk   |   9 April 2021 4:30 AM GMT
లాక్ డౌన్ పై మోడీ.. కసీఆర్.. జగన్ మాట ఒక్కటే
X
విషయం ఒక్కటే. కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఏం జరగనుంది? ఆంక్షల్ని విధించనున్నారా? పాక్షిక లాక్ డౌన్ అమలు చేస్తారా? రాత్రిళ్లు కర్ఫ్యూ విధిస్తారా? లాంటి సందేహాలెన్నో. అయితే.. ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు ముగ్గురు వేర్వేరుగా స్పందించినప్పటికీ.. దాని సారాంశం మాత్రం ఒక్కటే. అది.. ఇప్పటికైతే ఎలాంటి పరిమితులు ఉండవు అని.

గడిచిన కొద్ది రోజులుగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆంక్షల్ని విధిస్తారా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. అలాంటిదేమీ ఉండదని ఈ ముగ్గురు స్పష్టం చేశారు. కరోనా నివారణకు సలహాలు.. సూచనలు మరింత పెంచటమే కాదు.. వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన మరింత పెంచాలన్న ఆలోచనతోనే ప్రభుత్వాలు ఉన్నాయి తప్పించి.. చర్యల కత్తికి పదును పెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపించటం లేదు.

గత ఏడాది విధించిన లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బ తినటమే కాదు.. ఇప్పటికి రాష్ట్రాలు ఆ ప్రభావం నుంచి బయటపడింది లేదు. ఇలాంటివేళలో.. మళ్లీ పరిమితులు విధించినా.. ఆంక్షల్ని అమలు చేసినా.. ఆర్థిక అంశాలపై ప్రభావాన్నిచూపుతుందన్న ఆలోచనలో ఉన్నారు. ఈ కారణంతోనే వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత పెంచటంతో పాటు.. కేసుల వ్యాప్తికి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. రానున్న రోజుల్లో మహారాష్ట్ర మాదిరి కేసులు అనూహ్యంగా పెరిగితే తప్పించి.. ఇప్పుడున్న పరిస్థితులు ఇలానే కొనసాగితే మాత్రం.. ఎలాంటి పరిమితులు ఉండవన్న మాట బలంగా వినిపిస్తోంది.