Begin typing your search above and press return to search.
కేసీఆర్ నే నా గురువు అన్న బండి సంజయ్
By: Tupaki Desk | 20 April 2023 5:07 PM GMTతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నోట ఎప్పుడూ మంత్రాలు రావు బూతులే వస్తాయని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తుంటారు. అధికార బీఆర్ఎస్ నేతలతో పోటీ పోటీగా కౌంటర్లు వేయడంలో బండి సంజయ్ దిట్ట. ఇప్పటికీ ఆయన మాటల మంటలు రేపుతుంటారు ఇప్పటికీ కూడా.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎప్పుడు ఏం మాట్లాడుతో ఎవరికీ తెలియదు. ఆయన వ్యాఖ్యలు చాలా సార్లు వివాదాస్పదమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రతీసారి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలతో బండి వార్తల్లో నిలుస్తుంటాడు.ఇక బీఆర్ఎస్ నేతలు కూడా గట్టిగానే బండి కి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల బండిని అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించింది బీఆర్ఎస్ సర్కార్.
తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు తనను బూతులు మాట్లాడుతున్నారని చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ నేను బూతులు మాట్లాడుతున్నానా? అయితే నాకు గురువు సీఎం కేసీఆర్ యే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గోబెల్స్ ను మించిన వ్యక్తి అని పేర్కొన్న బండిసంజయ్ అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్ కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు.
ఇక హరీష్ రావును కూడా వదలకుండా బండి సంజయ్ కామెంట్స్చేశారు. ఉద్యమంలో పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టే ఎందుకు దొరకలేదో చెప్పు అంటూ సెటైర్లు వేశారు. మిషన్ భగీరథ నీళ్లు ఏవని. ఇంటింటికి నీళ్లు ఇచ్చిందే లేదని బండి సంజయ్ మండిపడ్డారు. 40 వేల కోట్లు ఖర్చు పెట్టిన మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఇంటింటికి నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగను అన్నారని ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వెళ్లి ఓట్లు అడుగుతారు అంటూ ప్రశ్నించారు.
తన మాటలకు, చేతలకు కేసీఆర్ గురువు అని.. ఆయనతో సరితూగేలా తాను మాట్లాడుతూనే ఉంటానంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు. తిట్టలో నాకు గురువు ఆదర్శం కేసీఆర్ అంటూ బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.