Begin typing your search above and press return to search.
గ్రేటర్ లో దెబ్బ పడిన తర్వాత దూకుడు పెంచిన సారు
By: Tupaki Desk | 9 Dec 2020 3:17 AM GMTఎవరెన్నిచెప్పినా.. వందకు తగ్గేది లేదు.. ఆ మాటకు వస్తే వందకు నాలుగైదు డివిజన్లను సొంతం చేసుకోవటమే లక్ష్యమని చెప్పుకొచ్చారు మంత్రి కేటీఆర్. ముఖ్యమంత్రి సైతం గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ ఆశల్ని సిద్ధం చేశారు. సారు అనుకున్నది ఒకటైతే.. అందుకు భిన్నంగా ఫలితాలు వెల్లడయ్యాయి. గులాబీ బాస్ తో సహా ఎవరూ అంచనా కూడా వేయలేని రీతిలో సొంత బలం 99 డివిజన్ల నుంచి 55 డివిజన్లకు దిగజారితే.. నాలుగు డివిజన్లలో మాత్రమే ప్రాతినిధ్యం వహించే కమలనాథులు ఏకంగా 48 డివిజన్లనుసొంతం చేసుకోవటాన్నిఅస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల నుంచి ఇంకా కోలుకోని సారుకు.. గ్రేటర్ షాక్ మరింత బాగా తగిలినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ ను టచ్ చేస్తే.. తాను హస్తినను కెలుకుతానని చెప్పటం.. మిగిలినరాజకీయ పార్టీలకు భిన్నమైన కమలనాథులు.. మరింతగా చెలరేగిపోతున్నారు. మాటకు మాట అన్నట్లుగా వారి తీరు ఉంటుంది. నువ్వు ఒకటి అంటే.. మేం నాలుగు అంటామని అనటమేకాదు..చేతల్లోనూ చేసి చూపిస్తున్న వైనం భావోద్వేగ రాజకీయల్నిమరింత రగిలేలా చేస్తోంది.
గ్రేటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏమైందో ఏమో కానీ.. వరుస పెట్టి సమీక్షా సమావేశాల్ని నిర్వహిస్తున్నారు. గడిచిన ఆరేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా.. సమీక్షలకుకు ప్రయారిటీ ఇస్తూ వరుస పెట్టి వివిధ శాఖలకు నిర్వహిస్తున్న రివ్యూల్లో సీరియస్ గా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకిలా? దాని వెనుక లెక్క ఏమిటి? అన్న విషయాల్లోకి వెళుతున్న వారికి ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి.
త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్ననాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అంశాల్ని ప్రత్యేకంగా పరిశీలించటంతోపాటు.. అక్కడి సమస్యల పరిష్కారం గురించి అడిగి తెలుసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బంద్ సందర్భంలో మిగిలిన రాజకీయ పక్షాల కంటే కూడా.. టీఆర్ఎస్ దూకుడ్ని పెంచింది. దీనికి కారణం.. సాగర్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలన్న ఆలోచన.. కింది స్థాయి నేతలతో నేరుగా టచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికితోడు రైతుల పక్షాన నిలిచి పోరాటం చేసినట్లుగా బిల్డప్ ఇవ్వటం కోసమే ఇంత భారీగా రోడ్ల మీదకు వచ్చారని చెబుతున్నారు. ఏమైనా.. రానున్న కొద్ది రోజుల్లో జరిగే సాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలన్న పట్టుదలతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఎప్పుడు లేనంత ఎక్కువగా దూకుడుతనాన్ని ప్రదర్శిస్తే.. ఓటర్లు తమవైపునకు టర్న్ కావటానికి ఎక్కువ అవకాశం ఉందన్న కాన్సెప్టుతో వెళుతున్నారని చెప్పక తప్పదు.