Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఖాతాలో మరో రికార్డు
By: Tupaki Desk | 27 May 2016 4:08 PM GMTతెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ మరో రికార్డును తన ఖాతాలో నమోదు చేసుకున్న వీడీపీ అసోసియేట్స్ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌కు మరో గౌరవం దక్కింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో కేసీఆర్ మోస్ట్ పాపులర్ సీఎంగా నిలిచారు. దేశవ్యాప్తంగా 86శాతం మంది సీఎం కేసీఆర్ పాలనపై సంతృప్తికరంగా ఉన్నట్టు వీడీపీ అసోసియేట్స్ సర్వే వెల్లడించింది. తద్వారా దేశంలోని మిగతా సీఎంలను తోసిరాజని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రప్రథమ స్థానంలో నిలిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో ఆకట్టుకుంటున్నాయని ఈ సందర్భంగా తేల్చింది.
ఇదిలాఉండగా ఏపీ సీఎం - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలనపై 69 శాతం మంది మాత్రమే సంతృప్తికరంగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. సీఎం కేసీఆర్ తర్వాతి ర్యాంకుల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ - పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిలిచారు.గతంలోనూ కేసీఆర్ కు ఉత్తమ సీఎంగా పలు జాతీయ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే.