Begin typing your search above and press return to search.

మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   6 Dec 2020 7:19 AM GMT
మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కీలక నిర్ణయం
X
తెలంగాణపై దండయాత్ర చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే మోడీ సర్కార్ పై పోరుబాటకే రెడీ అయినట్లు తెలుస్తోంది. తాజాగా మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ రైతులు చేస్తున్నఆందోళనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలిపారు. ఈనెల 8న తలపెట్టిన భారత్ బంద్ కు తమ సపోర్టు ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

రైతుల తలపెట్టిన భారత్ బంద్ విజయవంతానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. బంద్ ను విజయవంతం చేయడానికి అన్నివర్గాల వారు మద్దతు తెలపాలని కేసీఆర్ కోరారు.రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల పోరాటం న్యాయబద్దమైనదని.. వారి డిమాండ్స్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతునిస్తుందని కేసీఆర్ ప్రకటనలో తెలిపారు.

ఇక 8న రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు కాంగ్రెస్ తోపాటు ఆర్జేడీ, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంల్, ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర వామపక్షాలు, డీఎంకే మద్దతు ప్రకటించాయి. ఇప్పటికే బంద్ కు 10 కేంద్ర కార్మిక సంఘాల వేదిక మద్దతుగా నిలిచింది.