Begin typing your search above and press return to search.

తాజాగా కేసీఆర్ కొన్న కొత్త పుస్తకాలు

By:  Tupaki Desk   |   27 Sep 2015 3:30 PM GMT
తాజాగా కేసీఆర్ కొన్న కొత్త పుస్తకాలు
X
సమకాలీన రాజకీయాల్లో పుస్తకాలు విపరీతంగా చదివేసే అతికొద్ది మంది రాజకీయ నేతల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకరు. ఆయన ఇప్పటికే వేలాది పుస్తకాలు చదివేశారు. ఇంకా చదవాలన్న అభిలాషను వ్యక్తం చేస్తారు. విషయం ఏదైనా సరే.. ఆయన దృష్టిని ఆకర్షించిందంటే అందుకు సంబంధించిన పుస్తకాలతో పాటు.. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీలు నిర్వహిస్తుంటారు.

తాజాగా చైనా పర్యటన వెళ్లి వచ్చిన తర్వాత చైనా దేశం గురించి.. ఆ దేశంలో తాను చూసిన అంశాల గురించి కేసీఆర్ పెద్దగా మాట్లాడింది లేదు. కానీ.. ఆయన మనసుపై మాత్రం చెరగని ముద్రను చైనా వేసిందని చెబుతున్నారు. ఆకాశ హర్మ్యాలు.. చైనా పారిశ్రామిక ప్రగతి.. చైనా పరిపాలన తీరు తెన్నులన్నీ ఆయనపై తీవ్ర ప్రభావితం చేసినట్లుగా ఆయన సన్నిహితులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు తాజాగా ఆయన తెప్పించిన కొత్త పుస్తకాల్ని చూస్తే.. ఈ విషయం మరింత స్పష్టమవుతుందట.

చైనా పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు.. అతి ఎత్తైన భవనాలకు సంబంధించిన పుస్తకాల్ని తెప్పించినట్లు తెలుస్తోంది. మరి.. వీటిని మదించిన తర్వాత మరెన్ని కొత్త ఆలోచనలతో పరిపాలనా రథాన్ని నడిపిస్తారో చూడాలి. చైనా పర్యటన తర్వాత కేసీఆర్ ఆలోచనలు చాలానే మార్పులకు గురైనట్లుగా చెబుతున్న వాదనల్లో నిజమేమిటో.. ఆయన తీసుకునే నిర్ణయాలు చెప్పే అవకాశం ఉందని చెప్పొచ్చు.