Begin typing your search above and press return to search.

గులాబీ నేత‌ల‌కు టార్గెట్లు ఇచ్చేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   21 Aug 2018 5:32 AM GMT
గులాబీ నేత‌ల‌కు టార్గెట్లు ఇచ్చేసిన కేసీఆర్
X
షెడ్యూల్ ప్ర‌కారం జ‌ర‌గాల్సిన అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ఎడెనిమిది నెల‌లు ముందుకు తీసుకొచ్చేలా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్న వైనంపై బోలెడ‌న్ని వార్త‌లు వ‌స్తున్నాయి. ముంద‌స్తు అని విప‌క్షాలు వ్యాఖ్యానిస్తుంటే.. ఛ‌త్.. ఆ మాత్రం కూడా తెలీదా? ప్ర‌భుత్వ గ‌డువు ముగియ‌టానికి ఆర్నెల్ల ముందు నిర్వ‌హించే ఎన్నిక‌ల్ని ఎవ‌రూ ముంద‌స్తు అన‌రంటూ కేసీఆర్ క్లాస్ పీకినప్ప‌టికీ.. చాలామంది మాత్రం దీన్ని ముంద‌స్తుగానే అభివ‌ర్ణిస్తున్నారు.

ముంద‌స్తుకు సంబంధించిన కీల‌క ప్ర‌క‌ట‌న‌ను ముందుగా ప‌క్కాగా కొన్ని అంశాలు జ‌ర‌గాల‌న్న ఉద్దేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. రెండో విడ‌త రైతు సాయంతో పాటు..భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం సానుకూలంగా ఉన్న నేప‌థ్యంలో..మ‌రోసారి ఎన్నిక‌ల‌కు వెళితే మంచిద‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్నారు.

ఇదిలా ఉంటే.. త‌మ ప్ర‌భుత్వం సాధించిన ప్ర‌గ‌తిని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌టంతోపాటు.. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు దిమ్మ తిరిగేలా భారీ ప్లాన్ వేసిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు.. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ జ‌ర‌గ‌నంత భారీ స‌భ‌ను ఏర్పాటు చేయాల‌న్న‌ది కేసీఆర్ ల‌క్ష్యంగా చెబుతున్నారు.

ఈ వేదిక మీద నుంచి త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నోటి నుంచి మాట రాని రీతిలో ఎక్కువ‌గా హైద‌రాబాద్ శివారు స‌భ ఉండాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వైపు భారీ వ‌ర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో.. ఇప్ప‌టికిప్పుడు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న స‌భ ఏర్పాట్లు ఇబ్బంది అన్న మాట ప‌లువురు గులాబీ నేత‌ల నుంచి వ‌స్తోంది. దీనికి విరుగుడుగా కేసీఆర్ చెబుతున్న మాట‌లు నేత‌ల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.

స‌భ‌కు సంబంధించి ఎవ‌రేం ప‌నులు చేయాల‌న్న విష‌యంపై క్లారిటీగా చెప్పేసి కేసీఆర్‌.. ఎవ‌రెంత జ‌న‌సమీక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టాలో.. ఎవ‌రెంత నిధుల్ని ఖ‌ర్చు చేయాలో.. స‌భకు సంబంధించిన ఏర్పాట్ల‌ను కేసీఆర్ ఒక్కొక్క‌రిగా బాధ్య‌త‌లు ఇప్ప‌టిక అప్ప‌గించిన‌ట్లుగా తెలుస్తోంది. జ‌నాల్ని తీసుకురావ‌టానికి అవ‌స‌ర‌మైన బ‌స్సుల్ని ఇప్పుడే ఫైన‌ల్ చేసుకోవాల‌న్న మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్న‌ది తామే కాబ‌ట్టి.. స‌భ ఏర్పాట్ల‌కు సంబంధించి నేత‌లు హ‌డావుడి ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న మాట వినిపిస్తోంది. త‌మ‌కున్న వ‌న‌రులు.. శ‌క్తిసామ‌ర్థ్యాల‌కు మూడు రోజుల ముందు కూడా స‌మ‌యం స‌రిపోతుంద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఈ కార‌ణంతోనే అధినేత కేసీఆర్ తో పాటు.. గులాబీ నేత‌లంతా భారీ బ‌హిరంగ స‌భ విష‌యంలో కూల్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది.