Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఫ్యూచర్ అధికారుల చేతుల్లో ఉందా?
By: Tupaki Desk | 2 April 2016 6:52 AM GMTకేసీఆర్ చమత్కారం తక్కువేం కాదు. తన ప్రత్యర్థులు తనపై దునుమాడే ప్రయత్నం చేస్తే.. అందరిలా ఆయన చెలరేగిపోరు. ఒక్క మాటతో వారి ప్రయత్నానికి చెక్ చెప్పటమే కాదు.. ఆయన వేసే పంచ్ తో అక్కడ నవ్వులు విరబూస్తాయి. కాలి కంకరెత్తే సమయంలో కేసీఆర్ నోట వెంట నిప్పుల వాన కురుస్తుందని అనుకునే సమయంలో ఎటకారపు మాటలు వినిపిస్తాయి. ఇలా చిత్రమైన రీతిలో ఆయన రియాక్ట్ అవుతుంటారు. ఎప్పుడు ఎలా స్పందిస్తారో కాస్త అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అందుకే.. ఆయన విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరిస్తుంటారు.
మిగిలిన ముఖ్యమంత్రులకు.. కేసీఆర్ కు ఓ పెద్ద వ్యత్యాసం ఉంటుంది. తాను రివ్యూ పెట్టే శాఖకు సంబంధించి కేసీఆర్ పూర్తిస్థాయి సబ్జెక్ట్ తో వస్తారు. విషయంపై ఆయనకున్న అవగాహన చూసిన అధికారులు నోరు వెళ్లబెడతారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో చోటు చేసుకున్న ఒక ఉదంతాన్ని అధికార వర్గాలు చెబుతుంటాయి. కొందరు సీనియర్ అధికారులతో కేసీఆర్ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. అప్పటివరకూ ఆయన రాజకీయ ప్రసంగాలు విన్న సదరు అధికారులు.. కేసీఆర్ కు సబ్జెక్ట్ మీద అవగాహన అంతగా ఉండే అవకాశం లేదని ఫీలయ్యారు.
కానీ.. రివ్యూ మొదలైన తర్వాత.. కేసీఆర్ శ్రోత అవుతారనుకున్నది కాస్తా.. ఆయన అడిగిన ప్రశ్నలు.. దానికి ఆయనే చెప్పిన సమాధానాలు విని సీనియర్ అధికారుల నోట మాట రాని పరిస్థితి. రాజకీయాలే కాదు.. సబ్జెక్ట్ విషయంలోనూ ఇంత పట్టు ఉందా? అని విస్మయం చెందిన నేతలు ఉన్నట్లు చెబుతారు. అప్పటి నుంచి అన్ని శాఖల అధికారులు కేసీఆర్ విషయంలో ఆచితూచి వ్యవహరించటం మొదలు పెట్టారు.
ఇక.. ఆయన సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలిసిందే. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు అనుకున్నట్లుగా జరిగితే 2019అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్ పార్టీకి ఎదురు ఉండదనే చెప్పాలి. ఈ విషయం కేసీఆర్కు తెలియంది కాదు. అందుకే ఆయన ఈ ప్రాజెక్టును అనుకున్న విధంగా పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. తాజాగా ఆయన ఈ ప్రాజెక్టు అంశంపై ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
అధికారులను ఉద్దేశించి ప్రసంగించిన కేసీఆర్ మిషన్ భగీరధ పనుల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తి చేస్తామని ప్రజలకు మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు.. నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ.. ‘‘ఓడగొడతారా ఏంది?’’ అని చమత్కరించారు. కేసీఆర్ నోటి వెంట ఇలాంటి మాటను ఏ మాత్రం ఊహించని అధికారుల ఒక్కసారి ఉలిక్కిపడిన పరిస్థితి. కేసీఆర్ నోటి వెంట వచ్చింది చమత్కారమన్న విషయాన్ని క్షణాల్లో గుర్తించిన అధికారులు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్ లో మిషన్ భగీరద కింద పనులన్నీ ఎప్పటికి పూర్తి అవుతాయని అధికారులు ప్రశ్నించగా.. 2017 డిసెంబర్ నాటికి అని చెప్పిన సందర్భంగా ‘ఓడగొడతారా?’ అన్న వ్యాఖ్యలు చేసి చిన్నపాటి షాకిచ్చారు. ఏది ఏమైనా.. విలక్షణంగా మాట్లాడుతూ షాకిచ్చే కేసీఆర్ చమక్కు చురుక్కు ఎలా ఉంటుందో నిజామాబాద్ అధికారులకు తాజాగా అనుభవంలోకి వచ్చిందని చెప్పక తప్పదు.