Begin typing your search above and press return to search.

సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   18 March 2021 2:04 PM GMT
సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్
X
కొత్త సచివాలయం నిర్మాణంపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఇవాళ పరిశీలించారు. ప్రస్తుత సచివాలయ ప్రాంగణంలోనే కొత్త సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. కొనసాగుతున్న ఈ నిర్మాణాలను సీఎం కేసీఆర్ గంటన్నర పాటు పరిశీలించారు.

నిర్మాణ పోకడలపై అధికారులను ఆరాతీశారు. అనుకున్న గడువులోగా సచివాలయ నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్ సూచించారు. నిర్మాణంలో వేగం పెంచాలని.. అత్యంత నాణ్యతతో చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రధాన గేట్, ఇతర గేట్లు నిర్మించే ప్రాంతాలను .. భవన సముదాయం నిర్మించే ప్రాంతాన్ని కేసీఆర్ పరిశీలించారు.

2019 జూన్ చివరి వారంలో సచివాలయ ప్రాంగణానికి వచ్చిన సీఎం కొత్త భవంతులకు శంకుస్థాపన చేసిన కేసీఆర్ తరుచుగా సచివాలయ నిర్మాణ ప్రాంతానికి వస్తూ వేగంగా పూర్తి చేయాలని సూచనలు చేస్తున్నారు.కొత్త సచివాలయం పనులను ముంబైకి చెందిన షాపూరస్ జీ పల్లోంజీ కంపెనీ దక్కించుకుంది. దాదాపు 617 కోట్లతో నూతన సచివాలయాన్ని తెలంగాణ సర్కార్ నిర్మిస్తోంది.కొత్త సచివాలయ నిర్మాణానికి సంబంధించిన బడ్జెట్ ను ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొత్త సచివాలయానికి బడ్జెట్ లో రూ.610 కోట్లు కేటాయించారు.