Begin typing your search above and press return to search.
ఆ ‘కళ’ను మరోసారి ప్రదర్శించిన కేసీఆర్
By: Tupaki Desk | 30 March 2016 4:52 AM GMTకేసీఆర్ మాటల టాలెంట్ ఎంతో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విషయం ఏదైనా కానీ.. ఆయన నోరువిప్పితే చాలు.. అప్పటివరకూ అదే విషయం మీద వాదన వినిపించిన వారి మాటలు చిన్నబోయేలా మాట్లాడటం.. అందరి మనసుల్ని దోచుకునేలా చేయటం కేసీఆర్ కు అలవాటే. తనకున్న కళను తెలంగాణ అసెంబ్లీలో మరోసారి ప్రదర్శించారు.
తెలంగాణ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల జీతాల పెంపు మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. విమర్శలు చేసే వారి నోరు మూయించేలా.. జీతాల పెంపు మీద మాట్లాడుతున్న వారి నోళ్లకు తాళాలు వేసేలా కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రజాప్రతినిధుల జీతాల పెంపు విషయంలో నోరెత్తి విమర్శ చేయటం ఎంత పెద్ద తప్పో అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ముందు వినిపించిన వాదనను మరోసారి చెప్పుకొచ్చిన ఆయన.. జీతాల పెంపు అత్యంత అవసరమని.. దాని గురించి విమర్శలు చేయటం దుర్మార్గం అన్నట్లుగా వ్యాఖ్యలు చేయటమే కాదు.. ఆయన వాదన మొత్తం విన్న వారంతా కన్వీన్స్ అయ్యేలా ఉండటం కొసమెరుపుగా చెప్పాలి.
ఇంతకీ జీతాల పెంపు మీద కేసీఆర్ చేసిన వాదన చూస్తే..
ఎమ్మెల్యేల జీతాల పెంపు మీద టీవీల్లో చర్చలు జరిపే వారి మాటలు విన్నానని.. దారుణంగా మాట్లాడారన్న కేసీఆర్.. వారి మాటలు వింటే బాధ కలిగిందని చెప్పుకొచ్చారు. ప్రజాప్రతినిధుల జీతాల పెంపు కారణంగా తెలంగాణ ప్రభుత్వం మీద పడే భారం రూ.42 కోట్లు మాత్రమేనని.. తెలంగాణ బడ్జెట్ మొత్తంతో పోల్చి చూసినప్పుడు.. ఇదో పెద్ద మొత్తం కాదని చెప్పేశారు.
తాను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండేవాడినని.. అప్పట్లో తనకు రూ.500 చెల్లించేవారని.. అందులో నీటి బిల్లు కోసం రూ.110 కట్ చేసి చేతికి రూ.390 ఇచ్చే వారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని చెప్పిన కేసీఆర్.. గతంలో తన అనుభవాన్ని.. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని.. ఆర్థిక కష్టాల్ని మనసు కదలించేలా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీతాల విషయంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో సమావేశమైన సందర్భంగా తన వాదనను వినిపించానంటూ.. అలనాటి విషయాల్ని కేసీఆర్ ప్రస్తావించారు.
ఒకసారి గండిపేటలో ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సమావేశం పెట్టారు. నేను మౌనంగా కూర్చున్నా. బ్రదర్ మౌనం ఎందుకు? మాట్లాడండి అన్నారు. నేను మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుందంటూనే ఎమ్మెల్యేల బాధలపై మాట్లాడా.
‘‘నా నియోజకవర్గ కేంద్రం సిద్ధిపేట. జిల్లా కేంద్రం సంగారెడ్డి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్. ఇలా అన్నీ దూరంగానే ఉన్నవే. ఓ ఎమ్మెల్యే 150కి పైగా కమిటీల్లో సభ్యుడిగా ఉంటాడు. 30 వరకు ప్రభుత్వపరమైన సమావేశాలకు హాజరు కావాలి. అసెంబ్లీ.. ఇతర అవసరాలకు హైదరాబాద్ చుట్టూ తిరగాలి. నిత్యం సందర్శకులు.. ఆరోగ్య సమస్యలతో వచ్చే వారు ఉంటూనే ఉంటారు. ఆసుపత్రి బిల్లుల కోసం సాయం చేయమని అడిగేవాళ్లు ఉంటారు. అలా అడిగినోళ్లకు కాదనలేక.. అప్పులు చేసి మరి డబ్బులు ఇచ్చే ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ.. ప్రజలు మాత్రం ఎమ్మెల్యేల దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని అనుకుంటారు. మొదట్లో నా కారును నేనే నడిపా. ఏదో టెన్షన్ లో ఉండటం.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా? డ్రైవర్ ను పెట్టుకోవాలి. సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. ఇలాంటి ఖర్చులెన్నో ఉంటాయి. ఇలాంటప్పుడు జీతాలు పెంచితే నేరంగా.. ప్రజాధనాన్ని తింటున్నట్లుగా అనటం సరికాదు. ఎమ్మెల్యేల జీతాల పెంపు విషయంలో పలువురి సభ్యుల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకున్నాం’’ అంటూ తన వాదనను సుదీర్ఘంగా వినిపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగా ప్రజాప్రతినిధుల జీతాలు పెంచటం తప్పేం కాదు. మరి.. వారి బాధల విషయంలో ఇంతగా ఆలోచించిన కేసీఆర్.. నిత్యం ఏవో ఒక పన్నులు వేసి మధ్యతరగతి జీవి నడ్డి విరిచే ప్రభుత్వాలు.. అతగాడికి వచ్చే అరకొర జీతాలు.. వాడి బతుకుబండి లాగేందుకు పడే కష్టం.. వాడికున్న అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు ఎందుకు తీసుకోరు? పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టే ప్రభుత్వాలు మధ్యతరగతి జీవిని లెక్కలో ఎందుకు వేసుకోరు? ఒక ఎమ్మెల్యేగా తన కష్టం గురించి అంతగా చెప్పిన కేసీఆర్.. సగటు జీవి గురించి అంతేలా ఆలోచిస్తే వాడికి ఎలాంటి తిప్పలు ఉండవు కదా?
ఇదొక అంశమైతే.. కేసీఆర్ చెప్పిన తీరులో నిలువెత్తు నిజాయితీతో వ్యవహరించే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? అందరూ నీతిగా నిజాయితీగా ఉంటే.. ఇప్పుడిచ్చే జీతాలకు మరో ఐదు రెట్లు పెంచినా ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. వారు కమిట్ మెంట్ తో పని చేస్తే.. సంక్షేమం పేరిట ఖర్చు చేస్తున్న వేలాది కోట్లు అర్థవంతంగా ఖర్చు అయితే.. పేదరికం ఇన్నాళ్లు ఉండే అవకాశం ఉంటుందా? కారు డ్రైవర్ ను పెట్టుకోవటం కోసం తానెంత ఇబ్బంది పడిన విషయాన్ని కదిలించే మాటలతో చెప్పిన కేసీఆర్.. ఎంతమంది నేతల ఆస్తులు ఎమ్మెల్యేలు అయ్యాక భారీగా పెరిగిన విషయంపై కేసీఆర్ ఏమంటారు..? దానికి ఏం సమాధానం ఇస్తారు?