Begin typing your search above and press return to search.

ప్ర‌తిప‌క్షాన్ని వీక్ చేసేలా కేసీఆర్ భారీ స్కెచ్‌

By:  Tupaki Desk   |   27 Oct 2017 5:47 AM GMT
ప్ర‌తిప‌క్షాన్ని వీక్ చేసేలా కేసీఆర్ భారీ స్కెచ్‌
X
అసెంబ్లీ స‌మావేశంలో ప్ర‌శ్నోత్త‌రాలు.. జీరో అవ‌ర్ లాంటివి అంద‌రికి తెలిసిందే. కానీ.. ఇక‌పై కొత్త అవ‌ర్ ఒక‌టి షురూ కానుంది. అది పిటిష‌న్ అవ‌ర్‌. ఎప్పుడూ విన‌ని ఈ అవ‌ర్ ఏంటి? ఇదెలా వ‌చ్చిందంటే.. అదంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుణ్య‌మ‌నే చెప్పాలి. స‌రికొత్త విధానాల్ని తీసుకొచ్చే కేసీఆర్‌.. ఈ రోజు ప్రారంభ‌మైన అసెంబ్లీ స‌మావేశాల్లో స‌రికొత్త‌గా పిటిష‌న్ అవ‌ర్ ను ప్రారంభించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

అసెంబ్లీ స‌మావేశాలు స్టార్ట్ అయ్యాక ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌టం ఆ త‌ర్వాత జీరో అవ‌ర్‌ ను ఏర్పాటు చేయ‌టం తెలిసిందే. ఈ స‌మావేశాల్లో జీరో అవ‌ర్ అయ్యాక పిటిష‌న్ అవ‌ర్‌ ను ప్ర‌వేశ పెడ‌తారు. ఇందులో ప్ర‌తి ఎమ్మెల్యే మాట్లాడే అవ‌కాశాన్ని క‌ల్పిస్తారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌కు సంబంధించి ప్ర‌తి ఎమ్మెల్యే ఒక్క మాట‌లో విష‌యాన్ని చెప్పి ప్ర‌భుత్వానికి పిటిష‌న్ ఇవ్వ‌ట‌మే ఈ అవ‌ర్ ఉద్దేశం.

జీరో అవ‌ర్ లో ఏం మాట్లాడ‌టానికైనా అవ‌కాశం ఉన్న‌ప్పుడు కొత్త‌గా ఈ పిటిష‌న్ అవ‌ర్ ఎందుక‌న్న సందేహం రావొచ్చు. ఇక్క‌డే ఉంది అస‌లు ముచ్చ‌ట అంతా. ప్ర‌తి ఎమ్మెల్యే ఈ పిటిష‌న్ అవ‌ర్ ను వినియోగించుకోవాల‌న్న మాట చెప్పిన నేప‌థ్యంలో.. అసెంబ్లీలో ఎక్కువ‌మంది స‌భ్యులు ఉండే అధికార‌ప‌క్ష ఎమ్మెల్యేలే పిటిష‌న్ అవ‌ర్ లో మాట్లాడ‌తారు.

దీంతో.. ప్ర‌జా స‌మ‌స్య‌ల విష‌యంలో అధికార‌పార్టీ ఎమ్మెల్యేల పిటిష‌న్లే ఎక్కువ‌గా తెర మీద‌కు వ‌స్తాయి. అదే స‌మ‌యంలో స‌భా కాలంలో ఈ పిటిష‌న్ అవ‌ర్ స‌మ‌యం ఎక్కువ‌గా తీసుకునే అవ‌కాశం ఉంది.

అధికార‌ప‌క్షానికి ఎక్కువ మైలేజ్ ఇవ్వటంతో పాటు.. సింహ‌భాగం వాయిస్ వినిపించేలా ఉన్న ఈ కార్య‌క్ర‌మంతో లాభ ప‌డేది ఎవ‌ర‌న్న‌ది ఇట్టే అర్థ‌మ‌వుతుంది. స‌రికొత్త సంప్ర‌దాయాన్ని ప్ర‌వేశ పెట్టిన పేరుతో పాటు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌భుత్వానికి ఉన్న క‌మిట్ మెంట్ ను ప్ర‌ద‌ర్శించే అవ‌కాశాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌దులుకోరు క‌దా. అందుకే.. ఇప్పుడున్న వాటితో పాటు ఇక‌పై తెలంగాణ అసెంబ్లీలో పిటిష‌న్ అవ‌ర్ క‌నిపించ‌నుంది. కేసీఆరా మ‌జాకానా!