Begin typing your search above and press return to search.

వారికి బిర్యానీగా మారిన కేసీఆర్ సంత‌కం

By:  Tupaki Desk   |   3 Nov 2017 7:03 AM GMT
వారికి బిర్యానీగా మారిన కేసీఆర్ సంత‌కం
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో విల‌క్ష‌ణ‌త అంతా ఇంతా కాదు. ఏ విష‌యానికి ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది అంచ‌నా క‌ట్ట‌టం క‌ష్టం. అది ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండే వారే కాదు.. సుదీర్ఘ‌కాలంగా ఆయ‌నతో ట్రావెల్ చేస్తున్న వారికి చాలా క‌ష్టం.. క్లిష్టం కూడా.

కేసీఆర్ లో లోపాల గురించి చెప్ప‌మ‌నంత‌నే గుక్క తిప్పుకోకుండా చెప్పే వారు చాలామందే క‌నిపిస్తారు. కానీ.. ఆయ‌న‌లో చాలానే మంచి గుణాలు కూడా ఉన్నాయి. ఎవ‌రికైనా ఏదైనా పెట్టాల‌ని ఆయ‌న ఒక్క‌సారి డిసైడ్ అయితే చాలు.. వ్య‌వ‌హారం వేరుగా ఉంటుంది. ఏదో అడిగారు క‌దా అని ఇవ్వ‌టంలా కాకుండా మ‌న‌స్ఫూర్తిగా ఇవ్వ‌టం.. స‌ద‌రు అడిగ‌నోళ్ల మ‌న‌సుల్ని కొల్ల‌గొట్ట‌టంలో కేసీఆర్ తీరు వేరుగా ఉంటుంది.

నిర్ణ‌యం తీసుకోవ‌టం నాలుగు రోజులు లేటుగా జ‌రిగినా.. తీసుకున్న నిర్ణ‌యం మాత్రం ఆయ‌న‌కు పిధా అయ్యేలా ఉంటుంది. ఎవ‌రైనా ఏదైనా డిమాండ్‌ ను కేసీఆర్ ముందు పెడితే.. డిమాండ్ కోరిన వారు సైతం ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అవుతుంటారు. ఆ మ‌ధ్య స‌చివాల‌యం ఉద్యోగులు జీతాల పెంపు కోసం ప‌ట్టుబ‌డితే.. క‌డుపు నింపేలా నిర్ణ‌యం తీసుకుంటాన‌ని చెప్పిన కేసీఆర్ చెప్పిన‌ట్లే చేసి ఉద్యోగుల‌కు షాకిచ్చారు.

సంప‌న్న రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా విశాల హృద‌యంతో జీతాలు పెంచేసిన కేసీఆర్‌.. తాను తీసుకున్న నిర్ణ‌యంతో బ‌క్క‌చిక్కిన ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు క‌రెంట్ షాక్ కొట్టేలా చేశారు. ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల‌న్న సిద్ధాంతాన్ని బాగా ఫాలో అయ్యే కేసీఆర్‌.. ఇలాంటివి చాలానే చేస్తుంటారు.

తాజాగా త‌మ జీతాలు పెంచాలంటూ తెలంగాణ స‌ర్కారుకు విన్న‌పాలు చేసుకున్నారు పార్ట్ టైం అధ్యాప‌కులు. జూనియ‌ర్ కాలేజీల్లో ప‌ని చేస్తున్న పార్ట్ టైం అధ్యాప‌కులు త‌మ వేత‌నాలు పెంచాల‌ని వారు కోరుతున్నారు. మంచి మూడ్ లో ఉన్నారో.. లేక వారి ఈతిబాధ‌ల మీద కేసీఆర్ కు అవ‌గాహ‌న ఉందో ఏమో కానీ.. వెంట‌నే పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు.

వారి విన్న‌పానికి ఓకే చెప్పేసిన కేసీఆర్‌.. వారు ఊహించ‌ని రీతిలో వేత‌న పెంపు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం వారికి రూ.10వేలు వ‌స్తోంది. కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో వారి వేత‌నం రూ.21,600కు పెరిగింది. అంటే.. ఇప్పుడు ప్ర‌స్తుతం వారు పొందుతున్న జీతానికి డ‌బుల్ కంటే ఎక్కువ వ‌చ్చిన‌ట్ల‌న్న మాట‌. త‌న ఒక్క సంత‌కంతో పార్ట్ టైం అధ్యాపకుల జీతాల తీరునే కేసీఆర్ మార్చేశార‌ని చెప్పాలి. ఏమైనా కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణ‌యం పార్ట్ టైం అధ్యాప‌కులకు బిర్యానీ తినిపించిన‌ట్లైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.