Begin typing your search above and press return to search.
కేసీయార్ బాబుకే ఫ్రెండ్... మరి జగన్ కి....?
By: Tupaki Desk | 11 April 2023 10:44 PM GMTకేసీయార్ చంద్రబాబు తూర్పు పడమరలు అని తెలుగు రాజకీయాల మీద ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యే విషయం. ఎందుకంటే ఉమ్మడి ఏపీలో బాబుతో పాటే టీడీపీలో పనిచేసి మంత్రి పదవి ఇవ్వలేదన్న కారణంతో ఉమ్మడి ఏపీలో చంద్రబాబుని మళ్లీ సీఎం ని కానీయను అని పంతం పట్టి నెరవేర్చుకున్న వారు కేసీయార్. అంతే కాదు 2015 లో చాలా సక్సెస్ ఫుల్ గా ఓటుకు నోటు కేసులో ఇరికించేసి టీడీపీ సౌండ్ లేకుండా చేసుకున్న చాణక్యుడు.
మొత్తానికి చూస్తే తెలంగాణాలో చంద్రబాబు బూచిని చూపించి రెండవసారి అధికారం చేపట్టిన వ్యూహకర్త. ఇక ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అని అంటారు. అలా కేసీయార్ కి బాబు కంటే జగన్ తోనే దోస్తీ ఇష్టం అంటారు. బాబు ఏపీ సీఎం గా ఉంటే తన రాజకీయానికి ఇబ్బంది అని భావించి జగన్ని 2014 నుంచే ముఖ్యమంత్రిగా చూడాలని తపించిన వారు. అది ఎట్టకేలకు 2019 నాటికి తీరింది.
కానీ గట్టిగా ఏడాది కూడా ఆ స్నేహ బంధం నిలవలేదు. ఇద్దరి దారులూ వేరు అయిపోయాయి. కేసీయార్ సుదీర్ఘమైన రాజకీయం చేసిన వారు, చూసిన వారు, ఆయనకు రెండు సార్లు సీఎంగా కూడా అనుభవం అయింది. పైగా అందివచ్చిన వారసుడు కేటీయార్ ఉన్నారు. దాంతో జాతీయ రాజకీయాల్లోకి దూకాలనుకున్నారు. అందుకోసం ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చారని చెబుతారు.
ఇక బీజేపీతో మంచిగా ఉంటూ తన మద్దతు శాశ్వతం చేద్దామని ఒక దశలో అనుకున్నారని టాక్. తనకు కేంద్రంలో కీలకమైన ఉప రాష్ట్రపతి పదవి వంటివి ఇస్తారేమో అని కూడా పావులు కదిపారు అంటారు. కానీ బీజేపీ పెద్దలు కేసీయార్ కంటే రెండాకులు ఎక్కువ చదివారు అన్నది తెలిసిందే. ఫలితంగా కేసీయార్ బీజేపీ స్నేహం బెడిసికొట్టింది. అంతే కాదు బీజేపీ పెద్దలు జగన్ని కేసీయార్ నుంచి విడదీశారు అంటారు.
దాంతోనే ఏపీలో కూడా కేసీయార్ ఇపుడు పార్టీని విస్తరించాలనుకుంటున్నారు. ఆయన ఏపీకి ఇంకా రాకుండానే ఉక్కు మంటను రాజేశారు. నిజానికి కేసీయార్ బీయారెస్ ఏపీలో విస్తరిస్తే తొలి దెబ్బ పడేది తెలుగుదేశానికి అని అంతా ఊహించరు. కానీ ఇపుడు చూస్తూంటే వైసీపీనే ఆయన తన రాజకీయంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. దీంతో జగన్ కే ఉక్కు కర్మాగారం తలనొప్పి తగులుకుంది అంటున్నారు.
కేంద్రంలో మోడీతో ఢీ అంటున్నా కూడా కేసీయార్ చూపు ఏపీ లో రాజకీయం మీదనే ఉంది అని చెప్పాలి. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ని కేంద్రం అమ్మేస్తే మేము కొంటాం రెడీ అన్న మాటలు ఏపీ మొత్తాన్నే ఆకట్టుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ రోజు ఉద్యమాల రూపం మారింది. ఎత్తుగడలు మారాయి. ప్రైవేటైజేషన్ వద్దు అని చెప్పడం కాదు వేరే మార్గాల ద్వారా కార్మికుల ప్రయోజనాలు రక్షించాలి. ఈ విషయం లో కేసీయార్ దూకుడు మామూలుగా లేదు.
నిజంగా స్టీల్ ప్లాంట్ లో పరిమితమైన ఆపరేషన్ అంటున్నా బిడ్ లో తెలంగాణా సర్కార్ పాలుపంచుకుని దక్కించుకుంటే మాత్రం ఏపీలో బీయారెస్ పాగా వేసినట్లే. అంతే కాదు ఆ ఇంపాక్ట్ వైసీపీ మీద గట్టిగా ఉంటుంది. ఇక ఏపీలో బీయారెస్ రాక పట్ల ఇప్పటిదాకా ఏమీ అనకుండా సైలెంట్ గా ఉన్న టీడీపీ మాత్రం ఇపుడు ఉక్కు ఇష్యూని చూసి బాగా ఎంజాయ్ చేస్తోంది. జగన్ మొద్దు నిద్ర పోతున్నారు అని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వంటి నేతలు విరుచుకుపడుతున్నారు
పొరుగున ఉన్న ప్రభుత్వం పాటి ధైర్యం లేదా అని విమర్శిస్తున్నారు. కేసీయార్ వ్యూహాలు ఈ విధంగా అదుర్స్ అనిపించేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో ఆయన ఏపీ జనాలకు దగ్గర అవుతున్నారు. చంద్రబాబుకు కూడా మంచి ఫ్రెండ్ గా మారిపోతున్నారు. అదే టైం లో జగన్ కి మాత్రం బిగ్ ట్రబుల్ గానే అవతరిస్తున్నారు. ఏపీలో అసలే విపక్షాలు అన్నీ కలసి జగన్ మీద మూకుమ్మడి దాడి చేస్తున్నాయి, ఇపుడు వారికి కేసీయార్ వంటి వ్యూహకర్త కూడా తోడు అవుతున్నారు. దాంతో జగన్ కి వైసీపీకి షాక్ ఇచ్చేలా రానున్న పరిణామాలు ఉండబోతున్నాయనే అంటున్నారు.