Begin typing your search above and press return to search.
ఏపీ మీద కేసీయార్ కి చాలా ఆశలు
By: Tupaki Desk | 21 May 2023 6:00 PM GMTఏపీలో మొత్తం మీద బీయారెస్ రాష్ట్ర కార్యాలయం స్టార్ట్ అయింది. దీంతో బీయారెస్ ఇక తన కార్యకలాపాలను జోరెత్తించనుందని తెలుస్తోంది. గుంటూరులోని అయిదు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన బీయారెస్ ఆఫీసుని ఏపీ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ ప్రారంభించారు.
ధూం ధాం గానే ఈ ఓపెనింగ్ జరిగింది. ఏపీలోని పలు జిల్లాలకు చెందిన బీయారెస్ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇక అయిదు అంతస్తుల ఈ భవనంలో మొదటి అంతస్తు పూర్తిగా సమావేశాలకు కేటాయిస్తారు. రెండు మూడు అంతస్తులలో పరిపాలనా విభాగాలకు కేటాయించారు. ఆ పై అంతస్తులో ప్రెసిడెంట్ ఉంటారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడారు. ఏపీలో బీయారెస్ కి రోజు రోజుకూ విశేష ఆదరణ లభిస్తోంది అని ఆయన పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో బీయారెస్ చురుకైన పాత్ర పోషిస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్ధి అంతా బీయారెస్ తోనే సాధ్యపడుతుందని ఆయన అంటున్నారు.
కేసీయార్ ఆలోచనలను కూడా తోట చెప్పేసారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ తో పాటు ఏపీలో బీయారెస్ ని పక్కా ప్లాన్ తో కేసీయార్ విస్తరిస్తారు అని తోట చంద్రశేఖర్ అంటున్నారు. ఆ ప్లాన్ ఏంటో తొందరలో కేసీయారే చెబుతారని అంటున్నారు. 2024లో ఏపీలో ఎన్నికలు ఉన్నాయి. బీయరెస్ మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తుందని తోట అంటున్నారు.
మరి ఏపీలో పొత్తులకు తావు లేకుండా ఒంటరి పోరుకే బీయారెస్ రెడీ అవుతోంది అన్న మాట. జూన్ నెలలో విశాఖలో బీయారెస్ భారీ సభ ఉండవచ్చు అని అంటున్నారు. అదే విధంగా విశాఖ సభతో ఏపీలో గులాబీ జెండా ఎగరేయడానికి కేసీయార్ శ్రీకారం చుడతారని చెబుతున్నారు.
ఏపీ మీద కేసీయార్ కి చాలా ఆశలు ప్లాన్స్ ఉన్నాయని అంటున్నారు. రానున్న రోజుల్లో ఏపీ మీద ఫుల్ ఫోకస్ పెడతారని తెలుస్తోంది. అందులో భాగంగా ఇపుడు ఆఫీస్ ని ఓపెన్ చేశారు. ఇక బీయారెస్ లో చాలా మంది నేతలు చేరుతారు అని అంటున్నారు. వారు ఏ పార్టీల నుంచి ఉంటారు. ఏంటి కధా కమామీషూ అంటే రానున్న రోజుల్లో చూడాల్సిందే అని అంటున్నారు.
ఇక పొత్తులతో టీడీపీ నుంచి టికెట్లు ఇవ్వక వైసీపీ నుంచి చాలా మంది నాయకులు బీయారెస్ లో చేరబోతారు అని అంటున్నారు. అయితే అదంతా రానున్న రోజుల్లో జరుగుతుందని చెబుతున్నారు. కానీ ఈ ఏడాది చివరలో తెలంగాణాలో జరిగే ఎన్నికల్లో మల్లీ బీయారెస్ గెలిస్తే మాత్రం ఏపీలో రాజకీయ పరిణామాలు టోటల్ గా చేంజ్ అవుతాయని అంటున్నారు. మొత్తానికి ఏపీలో గులాబీ జెండా ఎగిరింది. తరువాత ఏమిటి అన్నది రాజకీయ తెర మీద చూడాల్సిందే.