Begin typing your search above and press return to search.
పీవీ కోసం కేసీఆర్ సర్కారు చేసే ప్రోగ్రాం లిస్టు చూశారా?
By: Tupaki Desk | 1 Aug 2020 7:30 AM GMTపొగడాలన్నా.. తిట్టాలన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే. కాలానికి తగ్గట్లు తన స్టాండ్ ను ఆయన మార్చుకుంటుంటారు. ఒకప్పుడు పీవీని తిట్టిపోసిన కేసీఆర్.. ఇప్పుడు మన పీవీ.. మన ఠీవీ అంటూ ఆకాశానికి ఎత్తేయటం తెలిసిందే. పీవీ వందేళ్ల జయంతిని భారీగా నిర్వహించటం ద్వారా.. పీవీని తమ ఖాతాలో వేసుకోవాలన్న ప్రయత్నంలో ఆయన దూసుకెళుతున్నారు.
కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పే మాటలు చేతల్లోకి మారవు. కానీ.. అప్పుడప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఆయన ఏం అనుకుంటారో.. దాన్ని పక్కాగా చేస్తుంటారు. పీవీ విషయంలో ఈ మధ్యన ఆయన చెప్పిన మాటలు ఉత్తవి కావని.. రానున్న రోజుల్లో భారీ కార్యక్రమాలు చేపట్టేందుకు వీలుగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.
తాజాగా పీవీ శతజయంతి ఉత్సవాల్ని ఎంత భారీగా నిర్వహించాలి? ఏయే కార్యక్రమాల్ని ఎప్పుడెప్పుడు చేపట్టాలన్న విషయాన్ని చర్చించేందుకు తాజాగా భారీ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మంత్రి కేటీఆర్ తో పాటు.. పీవీ శతజయంతి ఉత్సవకమిటీ ఛైర్మన్ కేకేలతో పాటు పీవీ కుమార్తె వాణీదేవి.. కుమారుడు ప్రభాకర్ రావుతో పాటు పలువురు ముఖ్యులు హాజరయ్యారు. చివరకు ఏపీ ప్రభుత్వ సలహాదారు కె.రామచంద్రమూర్తి సైతం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రానున్న రోజుల్లో ఏమేం కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. అందులో పలు కార్యక్రమాల్నిడిజైన్ చేశారు. అవేమంటే..
- పీవీ జ్ఞానభూమిలో నిర్మించే మెమోరియల్ హాళ్లకు సంబంధించి నాలుగు డిజైన్లు సిద్ధం చేసి.. సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆమోదముద్ర వేయించుకోవాలి.
- నిర్మాణాల్ని 2021 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలి
- ఈ స్మృతి మందిరం పీవీ వ్యక్తిత్వానికి, భారతీయతత్వానికి అద్దం పట్టాలి.
- అమెరికా.. లండన్.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్.. సింగపూర్ తదితర దేశాల్లో పీవీ విగ్రహాల్ని ఆవిష్కరించాలి. ఈ సందర్భంగా చర్చలు.. ప్రసంగాలు నిర్వహించాలి. ఇందుకు అవసరమైన సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
- ప్రతి నెల ఒక థీమ్ తో ప్రోగ్రాం నిర్వహించాలి. ఆగస్టులో పీవీ సొంతూరు వంగరలో భూమిపుత్రుడికి నీరాజనం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.
- సెప్టెంబరులో.. ‘పీవీ గారికి కళాకారుల నీరాజనం’ పేరుతో చిత్రకారులు, కార్టూనిస్ట్‌లు, క్యారికేచరిస్ట్‌లు, ఫొటోగ్రాఫర్స్‌తో వర్క్‌షాపులు నిర్వహించాలి.
- అక్టోబరులో.. ఏపీలోని విజయవాడ, విశాఖలో‘తెలుగు ప్రజల నీరాజనం’ పేరుతో అక్కడి ప్రముఖులతో సదస్సులు నిర్వహించాలి.
- నవంబర్‌లో.. ‘పీవీకి సాహితీ-సాంస్కృతిక నీరాజనం’ పేరిట కవి సమ్మేళనాలు, సాహితీగోష్టులు, ఆయన రచనలు, కథలపై చర్చా కార్యక్రమాలు.
- డిసెంబర్‌లో పీవీ వర్ధంతి సందర్భంగా జాతీయస్థాయి సదస్సులు నిర్వహించాలి. విదేశాల్లో నిర్వహించాలి.
- పీవీ ఫోటోలతో అంతర్జాతీయస్థాయి కాఫీటేబుల్ పుస్తకాన్ని, పీవీ అముద్రిత రచనలను ప్రచురించాలి. గతంలో ప్రచురించిన పుస్తకాలను తిరిగి ముద్రించాలి.
- పీవీకి భారతరత్న, పార్లమెంట్‌లో విగ్రహం ఏర్పాటుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి ఇవ్వాలి. ఆ సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీలో పీవీ చిత్ర పటాన్ని ఆవిష్కరించాలి.
- రాష్ట్ర మంత్రిగా, సీఎంగా అసెంబ్లీలో పీవీ చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో ముద్రించాలి.