Begin typing your search above and press return to search.

రాబోయే రెండు రోజులు క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండ‌మ‌న్న కేసీఆర్

By:  Tupaki Desk   |   12 Oct 2020 5:30 AM GMT
రాబోయే రెండు రోజులు క‌లెక్ట‌ర్ల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండ‌మ‌న్న కేసీఆర్
X
మిగిలిన రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ భిన్న‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. మిగిలిన ముఖ్య‌మంత్రుల మాదిరి.. రోజూ సెక్ర‌టేరియ‌ట్ కు వెళ్ల‌టం.. క్ర‌మ‌ప‌ద్ద‌తిలో రివ్యూలు నిర్వ‌హించ‌టం.. త‌ర‌చూ మంత్రివ‌ర్గ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌టం.. ఇలా ప‌లువురు సీఎంల మాదిరి ఏ అంశాన్ని కేసీఆర్ ఫాలో కార‌న్న‌ విమ‌ర్శ ఉంది. త‌న‌దైన శైలిలో పాల‌న చేసే ఆయ‌న‌.. జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్ష నిర్వ‌హించ‌టం చాలా త‌క్కువ సంద‌ర్భాల్లో చేస్తుంటారు.

అలాంటి ఆయ‌న ఆదివారం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో తెలంగాణ జిల్లా క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. రానున్న రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీగా వ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. జిల్లాల్లోని అధికారులంతా ఎక్క‌డివారు అక్క‌డే ఉండిపోవాల‌ని కోరారు. అన్ని ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి.. అందుకు త‌గ్గ‌ట్లు ఏర్పాట్లు చేయాల‌న్నారు. భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని.. అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేయాల‌న్నారు.

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్రాజెక్టులు.. రిజ‌ర్వాయ‌ర్ల నుంచి నీటి విడుద‌ల కార‌ణంగా ప‌లు జిల్లాలు ప్ర‌భావితం కానున్నాయి. వీటిల్లో ఉమ్మ‌డి అదిలాబాద్.. నిజామాబాద్.. క‌రీంన‌గ‌ర్.. వ‌రంగ‌ల్.. ఖ‌మ్మం జిల్లాలు ఉన్నాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్ర‌మాదం ఉంద‌ని.. భారీ ఎత్తున విద్యుత్ స్తంభాలు విరిగిపోయే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పారు. చెట్లు కూడా విరిగిప‌డే ప్ర‌మాదం ఉందని.. ఈ కార‌ణంగా ఆస్తి.. ప్రాణ న‌ష్టం వాటిల్లే వీలున్న‌ట్లు పేర్కొన్నారు.

వ‌ర‌ద‌ల స‌మ‌యంలో ఏ తీరులో అయితే జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో.. రానున్న రెండు రోజుల్లోఅదే విధంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. చిన్న చిన్న వంతెన‌లు.. కాజ్ వేల మీద పాద‌చారుల రాక‌పోక‌ల్ని నిషేధించాల‌న్నారు. ఎప్పుడు లేని రీతిలో భారీ వ‌ర్షాల‌కు అవ‌కాశం ఉందంటూ.. మొద‌టే అప్ర‌మ‌త్తం చేసిన తెలంగాణ సీఎం తీరు చూస్తే.. రానున్న రెండు రోజులు భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ చెప్పిన‌ట్లే.. వ‌ర్షాలు ఏ రీతిలో కురుస్తాయ‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.