Begin typing your search above and press return to search.
కేసీఆర్ సొంత సర్వే ఏం చెప్పిందో తెలుసా?
By: Tupaki Desk | 10 Oct 2016 9:43 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం సర్వేల మంత్రం జపించే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలో నడిచారు. ప్రజల నాడి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నంలో బాబు తరచుగా ప్రైవేటు - పార్టీ తరఫున సర్వేలు చేయిస్తుంటారు. ఇపుడు అదే బాటలో కేసీఆర్ నడిచారు. సాక్షాత్తు ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంలో కొత్తగా నియమితులైన కార్పొరేషన్ల చైర్మన్లు - మహబూబ్ నగర్ - నల్లగొండ జిల్లాలకు చెందిన ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఇతర నాయకులు కలిశారు. వీరితో సీఎం కేసీఆర్ చాలాసేపు మాట్లాడి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు మనవైపే చూస్తున్నారని ఇటీవల ఓ ప్రైవేటు ఏజెన్సీతో చేయించిన సర్వే తేలిందని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పినట్టు సమాచారం. పరిపాలనపై ప్రజల కండ్లలో నిండు సంతృప్తి కనిపిస్తున్నదని కేసీఆర్ పేర్కొంటూ 72-75 శాతం మంది ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాలపై హర్షం ప్రకటిస్తున్నారని తెలిపారు. ఖమ్మం లాంటి జిల్లాలో కూడా టీఆర్ ఎస్ పార్టీపై 65 శాతం మంది నమ్మకాన్ని వ్యక్తం చేశారని కేసీఆర్ విశ్లేషించారు. ప్రజలు మనపై ఉంచిన నమ్మకాన్ని ఇలాగే నిలబెట్టుకొనేలా పనిచేయాలని, ఏ విషయాన్ని కూడా ఆషామాషీగా తీసుకోవద్దని సుతిమెత్తగా హెచ్చరించినట్టు తెలిసింది. జిల్లాల ఏర్పాటు అనేది ప్రజల కోరిక మేరకేనని, మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని మండలాలపై నేతల్లో భిన్నాభిప్రాయాలున్న మాట వాస్తవమేనని - కొత్త మండలాల ఏర్పాటనేది డే టూ డే ప్రోగ్రాంలో చర్చించుకుందామని సముదాయించినట్టు కేసీఆర్ సమాచారం.
తాను చేయించిన సర్వేలో కాంగ్రెస్ - బీజేపీలు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నాయని తేలిందని సీఎం కేసీఆర్ అన్నట్టు తెలిసింది. 75 శాతం మంది ప్రజలు టీఆర్ ఎస్ ప్రభుత్వ కార్యక్రమాలను అర్థం చేసుకుని, అభినందిస్తున్నారని, ఎక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తం కాలేదని వివరించారు. ఖమ్మంలాంటి జిల్లాలో కూడా 65 శాతం మంది ప్రభుత్వంపై నమ్మకం వ్యక్తం చేసినందున రాష్ట్రంలో టీఆర్ ఎస్ కు తిరుగు ఉండదని - ప్రతిపక్షాలు చేసే కార్యక్రమాలను ప్రజలు హర్షించడం లేదని కేసీఆర్ అన్నట్టు తెలిసింది. రాష్ట్రంలో బీసీ గురుకులాలను నియోజకవర్గానికి ఒకటి చొప్పున వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తున్నామని - ప్రజలకు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సవివరంగా తెలుపాలని సూచించినట్టు తెలిసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/