Begin typing your search above and press return to search.

కేసీఆర్ చేతికి ఎముక లేదు: సీజేఐ ఎన్వీ రమణ

By:  Tupaki Desk   |   15 April 2022 11:45 AM IST
కేసీఆర్ చేతికి ఎముక లేదు: సీజేఐ ఎన్వీ రమణ
X
తెలంగాణ సీఎం కేసీఆర్.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణలు పరస్పరం పొగుడుకున్నారు. ఒకరి గొప్పతనాన్ని మరొకరు వల్లెవేశారు. ఇదంతా గచ్చిబౌలిలోని న్యాయాధికారుల సదస్సు సందర్భంగా చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

ఎన్వీ రమణ చొరవతో హైకోర్టు న్యాయవాదుల సంఖ్య పెరిగిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లోని జిల్లా న్యాయమూర్తులతో నిర్వహించిన ఈ సమావేశంలో రమణ, కేసీఆర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్వీ రమణ మాట్లాడుతూ.. 'చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్ మార్క్ సీఎం కేసీఆర్ అని' సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకొని ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని చూస్తే... కేసీఆర్ మాత్రం తెలంగాణలో 4320కి పైగా ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించారని తెలిపారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ వచ్చిందని.. వివాదాల పరిష్కారానికి ఈ కేంద్రం ఉపయోగపడుతోందన్నారు.

ఇక కేసీఆర్ మాట్లాడుతూ.. సీజేఐ సూచనతో 850 అదనపు పోస్టులు మంజూరు చేశామని తెలిపారు. జిల్లా కోర్టులకు 1730 అదనపు పోస్టులు మంజూరు చేశామన్నారు.

హైకోర్టు విడిపోయిన తర్వాత బెంచీల సంఖ్య పెంచాలని కేంద్రానికి లేఖ రాశామని.. హైకోర్టు బెంచీల సంఖ్య పెరిగింది కాబట్టి సిబ్బందిని ఏర్పాటు చేయాలని సీజేఐ చెప్పారని.. కోర్టుల మీద ఉన్న అపారమైన గౌరవంతో రెవెన్యూ కోర్టులు రద్దు చేశామన్నారు.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తుల కోసం డిస్ట్రిక్ క్వార్టర్స్ నిర్మిస్తామని.. 42మంది న్యాయమూర్తులకు ఒకే చోట క్వార్టర్స్, నిర్మాణం కోసం 30 ఎకరాల స్థలం సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాదియే నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.