Begin typing your search above and press return to search.
వాణీదేవిని ఒప్పించేందుకు భారీగా కసరత్తు చేసిన కేసీఆర్
By: Tupaki Desk | 22 Feb 2021 1:30 PM GMTఅనూహ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మొదట్నించి అలవాటు. తాజాగా అలాంటి నిర్ణయాన్నే తీసుకున్న ఆయన.. ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందు చేసిన కసరత్తు గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. ఎవరెన్ని చెప్పినా హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం పరిమితమని చెప్పక తప్పదు. దీంతో.. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ ఇప్పటివరకు సొంతం చేసుకోవటంలో తరచూ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అందుకే.. ఈసారి ఎన్నికల బరిలో నిలుచునే అవకాశం లేదన్న ప్రచారం చేస్తూనే.. మరోవైపు బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.
చివరకు పీవీ సెంటిమెంట్ ను తెర మీదకు తీసురావటం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు కూసింత అయోమయాన్ని ఇచ్చారని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పీవీ కుమార్తెను ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా ఎంపిక చేయటం కోసం భారీ కసరత్తే నిర్వహించారు కేసీఆర్. నామినేషన్ల దాఖలకు రెండు రోజుల ముందుగా వేసేందుకు వీలుగా తాజాగా ఆమె పేరును అనౌన్స్ చేయటం ద్వారా అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
అంతేకాదు.. పేరును ఫైనల్ చేయటానికి ముందు కేసీఆర్ జరిపిన కసరత్తు అంతా ఇంతా కాదు. వాణీదేవి అభ్యర్థిత్వాన్ని పార్టీకి చెందిన ముఖ్యులతో కేసీఆర్ స్వయంగా మాట్లాడారు. అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సీఎం రాజకీయ కార్యదర్శి శేరి సుభాష్ రెడ్డి తదితరులు కేకే ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి వాణీదేవితో ఫోన్లో మాట్లాడారు. అనంతరం.. ఆమె సానుకూలంగా స్పందించటంతో వాణీదేవి ఇంటికి కేటీఆర్ స్వయంగా వెళ్లి ఎన్నికల గురించి మాట్లాడారు. చివరకు ఆమె కన్వీన్స్ కావటంతో.. ఆమె పేరును అధికారికంగా వెల్లడించారు.
వాణీదేవిని ఎంపిక చేయటంతోనే తన బాధ్యత అయిపోయిందన్నట్లుగా కేసీఆర్ వ్యవహరించకపోవటం గమనార్హం. ఆమె గెలుపు కోసం పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఆమె బరిలో దిగే ఎమ్మెల్సీ ఎన్నిక పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్తర్యేకంగా ఇంచార్జీతో పాటు.. ఉమ్మడి జిల్లాల సమన్వయకర్తల్ని నియమించాలని నిర్ణయించారు. ఈ ఎన్నికకు సంబంధించి ప్రచార బాధ్యతల్ని కేటీఆర్ కు.. పార్టీ పార్లమెంటరీ నేత కేకేకు అప్పగించటం గమనార్హం. కేసీఆరా మజాకానా.