Begin typing your search above and press return to search.
సీఎం ఇంటి చుట్టూ కీలక అధికారులకు కొత్తిళ్లు
By: Tupaki Desk | 5 Jun 2016 6:30 AM GMTకొత్త రాష్ట్రం.. కొత్త ప్రభుత్వం.. కొత్త తరహా పాలన. మరిన్ని ‘కొత్త’లు ఉన్నప్పుడు ‘కొత్త.. కొత్త’ ఇళ్లు.. కార్యాలయాలు లేకపోతే ఏం బాగుంటుంది? అని అనుకున్నారో లేక.. కొత్త సర్కారులో ‘పాత’కు చెక్ చెప్పాలనుకున్నారో కానీ.. వివిధ కారణాల మీద కొత్త కొత్త నిర్మాణాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయం తాను నమ్మిన వాస్తుకు తగ్గట్లుగా లేదన్న ఉద్దేశంతో కొత్త క్యాంప్ కార్యాలయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి ఇంటికి దగ్గర్లోనే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారుల ఇళ్లు కూడా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని వివిధ చోట్ల అధికారులు ఉంటున్నారు. దీంతో.. వారి ప్రయాణాల కోసం సమయం పెద్ద ఎత్తున తీసుకుంటుందన్న విషయాన్ని గుర్తించి కేసీఆర్.. ముఖ్యమంత్రి నివాసానికి దగ్గర్లోనే అందరి ఇళ్లు ఉండేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
దీనికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక సిద్ధమైంది. పంజాగుట్టలోని ఐఏఎస్ అధికారులకు ఉన్న క్వార్టర్లను కూలగొట్టి.. ఆ స్థానంలో కొత్త బంగళాలు నిర్మించాలని.. వాటిల్లో కీలకభాధ్యతలు నిర్వహించే అధికారులు మొత్తాన్ని అక్కడే ఉంచాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న అధికారుల్ని ఖాళీ చేయించటం.. వారికి ప్రత్యామ్నాయ నివాసాలుసిద్ధం చేయటంలో బిజీగా ఉన్నారు. ప్రత్యామ్నాయ నివాసాలకు జరుగుతున్న రిపేర్లు పూర్తి అయిన వెంటనే అధికారుల్నికొత్తిళ్లలోకి మార్చేసి.. ఇప్పుడున్న నివాసాల్ని నేలమట్టం చేసి.. కొత్త బంగళాల్ని నిర్మాణ పనుల్ని స్టార్ట్ చేయనున్నారు. ఇదంతా దసరా నాటికి నిర్మాణ పనులు ప్రారంభం కావాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. ప్రజాధనం అంతా కొత్త షోకుకే సరిపోయేటట్టుంది. మరి.. జనాలకు ‘కొత్త’ బతుకు అనుభవంలోకి వచ్చేదెప్పుడు..?