Begin typing your search above and press return to search.
సీఎంగా నాన్న కేటీఆర్ పై కేసీఆర్ మనవడు క్లారిటీ!
By: Tupaki Desk | 21 Jan 2021 8:07 AM GMTప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మార్పు గురించే.. కేసీఆర్ ప్లేసులో కేటీఆర్ సీఎం కాబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు తలసాని, ఈటల సైతం ఈ మధ్య ‘కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి?’ అని ప్రశ్నించాడు.
ఇక కేటీఆర్ సీఎం అవ్వడానికి ముహూర్తం కూడా పెట్టేశారనే వార్తలు వస్తున్నాయి. మరి కేసీఆర్ మదిలో ఏముందో తెలియదు కానీ.. సీనియర్ మంత్రులు సైతం కేటీఆర్ ను పట్టం కట్టడానికి ఓకే చెబుతున్నారు.
అయితే కేటీఆర్ సీఎం కాబోతున్నాడనే వార్తలపై సీఎం కేసీఆర్ మనవడు... కేటీఆర్ కొడుకైన హిమాన్షు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని గురించి తనకు తెలియదని.. ఇంట్లో ఉన్నప్పుడు నాన్న, తాతయ్య రాజకీయాల గురించి అస్సలు చర్చించరని తెలిపాడు.
బుధవారం ఇన్ స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించిన హిమాన్షు ఈ విషయాలను వెల్లడించాడు. కేటీఆర్, కేసీఆర్ లాగే రాజకీయాల్లోకి వస్తారా? అని ఒకరు అడగ్గా... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు. ఇక కేసీఆర్ దిగిపోయి కేటీఆర్ సీఎం అవుతాడన్న చర్చే తమ ఇంట్లో రాలేదని వివరణ ఇచ్చాడు. అదంతా ఒట్టి ప్రచారమని చెప్పుకొచ్చాడు.
మొత్తానికి బయట మీడియా, నేతలు ఊదరగొడుతున్న సరే.. లోపల కేసీఆర్ కుటుంబంలో మాత్రం ‘కేటీఆర్ సీఎం’ అన్న పదమే చర్చకు రాదని అర్థమైంది. స్వయంగా కేసీఆర్ మనవడు దీనిపై క్లారిటీ ఇవ్వడంతో ఈ ఊహాగానాలకు ఇప్పటికైనా తెరపడుతుందని తెలుస్తోంది.