Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం: 24 గంటలు వ్యాపారం చేసుకోవచ్చు
By: Tupaki Desk | 8 April 2023 10:01 AM GMTచిన్న నిర్ణయాలే అయినా.. తీసుకోవటానికి ప్రభుత్వాలు ముందుకు రావు. మారిన కాలానికి తగ్గట్లు.. ప్రజల అవసరాలకు తగిన రీతిలో నిర్ణయాలు తీసుకోవటానికి ఎందుకో సుముఖత వ్యక్తం కాదు. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు కాస్తంత భిన్నంగా ఉంటుంది. ఆయన కానీ ఒకసారి ఫోకస్ చేస్తే.. ఇలాంటి పాతకాలం నాటి చట్టాలను చుట్టకట్టేసినట్లు కట్టేసి.. హుస్సేన్ సాగర్ లో పడేస్తారు. తాజాగా అలాంటిదే ఒక నిర్ణయాన్ని తీసుకొని.. దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నంగా ముందుగా ఉండేలా కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.
షాపు ఏదైనా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు తెరిచి ఉంచుకునేందుకు వీలుగా చట్టాన్ని మారుస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే..ఇందుకోసం రూ.10వేల మొత్తాన్ని అదనంగా కట్టేస్తే సరిపోతుంది.అయితే.. దీనికి సంబంధించిన కొన్ని నిబంధనల(అన్నీ సుముచితమైనవే)ను పాటి స్తే సరిపోతుందని పేర్కొన్నారు. తాజాగా కార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో విడుదలైన జీవోను చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
24 గంటలు పని చేసే వ్యాపారానికి సంబంధించి పని చేసే సిబ్బందికి ఐడీ కార్డులు తప్పనిసరిగా జారీ చేయాలి. వారాంతపు సెలవు ఇవ్వాల్సిందే. వారంలో కచ్ఛితమైన పని గంటలు ఉండేలా చూడటం.. ఓవర్ టైంకు అదనపు జీతం ఇవ్వటం.. పండుగలు.. సెలవు దినాల్లో పని చేసిన వారికి అదనపు చెల్లింపులు జరపటం చేయాలి. లేదంటే కాంపెన్సేటరీ సెలవు ఇవ్వాలి. మహిళా ఉద్యోగులకు తగిన వేతనం తప్పనిసరి.
రాత్రి షిఫ్టులో పని చేసే మహిళా ఉద్యోగుల నుంచి వారి ఇష్టపూర్వకంగానే అంగీకారం తీసుకోవాలి. రవాణా సదుపాయం కల్పించాలి. రికార్డుల్ని సరిగా నిర్వహించటంతో పాటు.. పోలీస్ యాక్టులోని నిబంధనల్ని తప్పనిసరిగా పాటిస్తే సరిపోతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ కొత్త నిబంధనలు తెచ్చినా.. హైదరాబాద్ మహానగరాన్ని మరో దిశగా తీసుకెళ్లేందుకు ఈ కొత్త ఆదేశాలు సాయం చేస్తాయని మాత్రం చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.