Begin typing your search above and press return to search.

కేసీఆర్ సర్కారు బడాయి లెక్క తేలింది.. చెరువుల్లో ఏపీనే ఫస్ట్

By:  Tupaki Desk   |   25 April 2023 9:31 AM GMT
కేసీఆర్ సర్కారు బడాయి లెక్క తేలింది.. చెరువుల్లో ఏపీనే ఫస్ట్
X
నోరు విప్పితే.. మిషన్ భగీరధ.. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పలు చెప్పుకునే తెలంగాణలోని కేసీఆర్ సర్కారు బడాయికి షాకిచ్చేలా తాజా నివేదిక బయటకు వచ్చింది. దేశంలో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచింది. ఇక ఎక్కువ కుంటలు రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. ఊటకుంటలు చెక్ డ్యామ్ లు లాంటి జల సంణ నిర్మాణాల్లో మహారాష్ట్ర ముందు స్థానంలో నిలిచింది.

అత్యధిక రిజర్వాయర్లు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఐదోస్థానంలో నిలవగా అత్యధిక జలసంరక్షణ నిర్మాణాలు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవటం వీటిల్లో వేటిలోనూ తెలంగాణ లేకపోవటం గమనార్హం. దేశంలో జలవనరుల మొదటి గణన చిన్న నీటి వనరులకు సంబంధించి ఆరో దఫా నిర్వహించిన గణనకు సంబంధించిన ఫలితాల్ని కేంద్ర జల్ శక్తి శాఖ ఇటీవల వెల్లడించింది. ఈ సందర్భంగా కీలక వివరాల్ని వెల్లడించింది.

ఏపీలో మొత్తం 1,13,425 చెరువులు ఉంటే అందులో 1,03,952 చెరువులు వినియోగంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. చిన్ననీటి వనరుల కింద దేశంలో 14.75 కోట్ల హెక్టార్ల భూమి ఉండటం గమనార్హం. ఇందులో అత్యధిక ఆయుకట్ట ఉన్న రాష్ట్రాల్లో 1.199 కోట్ల హెక్టార్ల భూమితో తమిళనాడు తొలి స్థానంలో ఉండగా. 54.28 హెక్టార్ల భూమితో రాజస్థాన్ రెండో స్థానంలో.. 49.71 హెక్టార్ల భూమితో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

దేశంలో జనలవరుల్లో 78 శాతం మానవ నిర్మితం కాగా.. 22 శాతం మాత్రం సహజసిద్ధంగా ఏర్పడినవని పేర్కొంది. జనవరుల్లో 83.7 శాతం వినియోగంలో ఉంటే.. 16.3 శాతం ఎండిపోయినట్లు పేర్కొన్నారు. జలవనరుల్లో పశ్చిమ బెంగాల్ 30.8 శాతంతో తొలి స్థానంలో నిలిస్తే.. 10.1 శాతంతో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో.. 7.9 శాతంతో ఏపీ మూడో స్థానంలో నిలిచాయి. 7.5 శాతంతో ఓడిశా నాలుగో స్థానంలో.. 7.1 శాతంతో అసోం ఐదో స్థానంలో నిలిచాయి. వీటిల్లో వేటిలోనూ తెలంగాణ లేకపోవటం గమనార్హం.