Begin typing your search above and press return to search.
సుప్రీం సీజే వద్దకే ఫాంహౌస్ కేసు.. తగ్గని కేసీఆర్ సర్కార్
By: Tupaki Desk | 8 Feb 2023 1:22 PM GMTమెయినాబాద్ ఫాం హౌస్ కేసు విషయంలో రాష్ట్ర సర్కార్ తగ్గేదేలే అంటోంది. ఈ కేసుపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రప్రభుత్వం సుప్రీం ఫస్ట్ బెంచ్ ను ఆశ్రయించింది. ఇందులోని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జస్టిస్ పర్దీవాలా ల ముందు ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే అప్పీల్ పిటీషన్ ప్రస్తావన గురించి వివరించారు.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు వివరాలను తెలిపారు. అయితే ప్రభుత్వం తరుపున న్యాయవాది సుప్రీం బెంచ్ ను కలవగా బుధవారం పిటిషన్ మెన్షన్ చేయాల్సిందిగా సూచించారు.
ఈ సందర్భంగా దుష్యంత్ దవే సుప్రీం ఫస్ట్ బెంచ్ ముందు వివరాలు అందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కొందరు కుట్ర పన్నారని, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. ఈ కేసును ముందుగా సిట్ విచారన చేసిందని, కానీ హైకోర్టు సింగిలి డివిజన్ బెంచ్ సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చిందన్నారు.
దీనిపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినా సింగిల్ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశామన్నారు. కానీ 'లెటర్స్ పెంటేంట్ చట్టం' ప్రకారం విచారణకు అర్హత లేదని తమ పిటిషన్ ను కొట్టివేశారని తెలిపారు.
సీబీఐ దర్యాప్తు వద్దని కోరినా చివరకు సింగిల్ డివిజన్ బెంచ్ తీర్పునే సమర్థిస్తూ తీర్పు చెప్పిందని దుష్యంత్ దవే వివరించారు. దీనిని పరిగణలోకి తీసుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ బుధవారమే పిటిషన్ ను మెన్సణ్ చేయాల్సిందిగా తెలిపారు. ఒకవేళ ఈరోజు సాధ్యం కాకపోతే వచ్చే వారం నేరుగా విచారణ చేపడుతామని భరోసా ఇచ్చారు. దీంతో సీబీఐ విచారణ ను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంలో సానుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం బుధవారం పిటిషన్ దాఖలు చేసింది. ఇది సింగిల్ డివిజన్ ముందకు విచారణకు వచ్చింది. అయితే దీనిని హైకోర్టు చీఫ్ తీర్పు ఇచ్చినందున అక్కడ అనుమతి లభించిన తరువాతే నిర్ణయం తీసుకుంటామని సింగిల్ డివిజన్ బెంచ్ అడ్వకేట్ జనరల్ కు సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు చీఫ్ నుంచి బుధవారం అనుమతి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.