Begin typing your search above and press return to search.
కేసీఆర్ సర్కారు కీలక నిర్ణయం.. మాస్కు పెట్టుకోకుంటే వెయ్యి ఫైన్
By: Tupaki Desk | 11 April 2021 12:30 PM GMTఅంతకంతకూ పెరిగిపోతున్న కరోనా కసుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ముఖానికి మాస్కు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. బయట ఎక్కడైనా సరే ముఖానికి మాస్కు లేకుండా కనిపిస్తే చాలు రూ.వెయ్యి ఫైన్ వేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. మాస్కు లేకుండా బయట కనిపిస్తే.. వెంటనే రూ.వెయ్యి ఫైన్ వేయాలని అత్యుత్తమ అధికారి మొదలు సామాన్య పోలీసు వరకు తాజా ఆదేశాన్ని పాటించాలని నిర్ణయంచారు.
ఎవరెన్నిచెబుతున్నా.. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ ఎంత ముఖ్యమో.. ముఖానికి మాస్కు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. ఇలాంటివేళ.. తాజాగా విడుదల చేసిన ఆదేశం.. అందరికి దిమ్మ తిరిగే షాకిస్తుందని చెప్పాలి. మాస్కులేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే.. వెయ్యి ఫైన్ వేస్తారని.. అప్పటికి వినకుంటే.. అంటువ్యాధుల నియంత్రణ చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేయాలని స్పష్టం చేసింది.
వాస్తవానికి ముఖానికి మాస్కులు తప్పనిసరి చేయటంతో పాటు.. ఆ రూల్ ను పాటించని వారిపై విపత్తు ఉల్లంఘన చట్టాన్ని ప్రయోగించి చర్యలు తీసుకోవాలని చెప్పారు. అయినప్పటికి ఆ చట్టాన్ని ప్రయోగించి నమోదు చేసిన కేసులు చాలా తక్కువ. తాజాగా జరమానా విధింపును కఠినతరం చేయటంతో పాటు.. పదేళ్ల లోపు.. 60 ఏళ్లు దాటిన పెద్ద వయస్కులు అవసరమైతే తప్పించి బయటకు రావొద్దని కోరింది.
ఇదిలా ఉంటే తెలంగాణ పోలీసు సైతం కీలక ఆదేశాల్ని జారీ చేశారు. బయట ప్రదేశాల్లో మీ చుట్టూ పోలీసు అధికారి లేరని ముఖానికి మాస్కులు తొలగిస్తే.. మూడోకన్నురూపంలో ఉండే సీసీ కెమేరాలు ఫోటోలు తీస్తాయని.. వాటి ఆధారంగా కూడా వెయ్యి రూపాయిల జరిమానా విధిస్తామని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన నిబంధనను.. ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏమైనా.. ముఖానికి మాస్కు లేకుండా బయటకు వెళ్లే సాహసం చేయొద్దు. జేబులు గుల్ల కావటం ఖాయం