Begin typing your search above and press return to search.

కాళ్లు మొక్కిన స్వామిని కేసీఆర్ వెళ్ల‌గొట్టారా?

By:  Tupaki Desk   |   12 July 2018 4:53 AM GMT
కాళ్లు మొక్కిన స్వామిని కేసీఆర్ వెళ్ల‌గొట్టారా?
X
మ‌నిషి మెమ‌రీ పెద్ద‌దే అయినా.. గూగుల్ కాలంలో దాన్ని ఉప‌యోగించ‌ట‌మే త‌గ్గించేశారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టెంట్ గా స‌మాధానాలు చెప్పేసే వ్య‌వ‌స్థ‌లు.. స‌మ‌స్య వ‌స్తే స‌ల‌హా అడ‌గ‌టానికి ఆన్ లైన్ ఉన్న వేళ‌.. మ‌న‌సులో విష‌యాల్ని దాచి పెట్టుకునే ఓపిక‌.. తీరిక ఎవ‌రికి లేవు. అందుకే.. గ‌తంలో ఎప్పుడూ లేనంత ఎక్కువ‌గా స‌మాచారాన్ని తీసుకుంటోంది నేటి త‌రం. ఇబ్బందేమంటే.. స‌మాచారాన్ని తీసుకోవ‌టం.. ఆ త‌ర్వాత మ‌రో స‌మాచారంతో ఫిల్ చేయ‌టంతో.. పాత విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు బై డిఫాల్ట్ డిలీట్ అయిపోతున్నాయి.

అయితే.. ఎక్క‌డో ఉండే ఒక‌ళ్లో.. ఇద్ద‌రి పుణ్య‌మా అని పాత విష‌యాలు కొత్త‌గా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే మ‌రో ముచ్చ‌ట తెర మీద‌కు వ‌చ్చింది. ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడారంటూ స్వామి ప‌రిపూర్ణానంద మీద న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేయ‌టం తెలిసిందే.

ఏదైనా మాట‌ను అన‌వ‌స‌రంగా మాట్లాడి ఉంటే.. వెనువెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాలి కానీ.. లెక్క‌లు పెట్టుకొని.. త‌ప్పుల చిట్టా ఒక స్థాయికి చేరే వ‌ర‌కూ ఆగ‌టం ఎక్క‌డి ధ‌ర్మ‌మో అర్థం కాని ప‌రిస్థితి. మొన్న‌టివ‌ర‌కూ ప‌రిపూర్ణ‌నంద స్వామి మాట‌లు త‌ప్పుగా అనిపించ‌ని చ‌ట్టాల‌కు.. క‌త్తి మ‌హేశ్ వ‌ర్సెస్ స్వామి ప‌రిపూర్ణ‌నంద‌కు ల‌డాయి ప‌డ‌టంతో గ‌తంలో ఆయ‌న చెప్పిన మాట‌ల్లోని త‌ప్పుల్ని చ‌ట్ట‌బ‌ద్ధంగా వెతికే ప‌నిలో ప‌డ్డారు తెలంగాణ పోలీసులు.

ఖాకీలు ఒక్క‌సారి డిసైడ్ అయిపోతే.. త‌ర్వాతేం జ‌రుగుతుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. తాజాగా అదే జ‌రిగింది. క‌త్తి మ‌హేశ్ ను అటూ ఇటూ తిప్పి.. ఎట్ట‌కేల‌కు క‌ర్ణాట‌క‌కు చేర్చ‌టం తెలిసిందే. మ‌రి.. గొడ‌వకు కార‌ణ‌మైన ఒక‌రిని పంపితే ర‌చ్చ అవుతుంది. అందుకేనేమో.. ప‌రిపూర్ణ‌నంద స్వామికి సైతం బ‌హిష్క‌ర‌ణ వేటు వేసేసి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం నుంచి బ‌య‌ట‌కు పంపేశారు.

ఈ రెండు బ‌హిష్క‌ర‌ణ వేటుపై ఇప్పుడు ప‌లువురు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ బ‌హిష్క‌ర‌ణ వేటు ఏంది? మ‌రీ.. ఇంత క‌ఠినంగానా? అంటూ మండిప‌డుతున్నారు. ఈ హ‌డావుడిలోనే మ‌రికొంద‌రు పాత వీడియోను బ‌య‌ట‌కు తీశారు. అందులో సీఎం కేసీఆర్ స‌తీ స‌మేతంగా స్వామి ప‌రిపూర్ణ‌నందకు పాదాభివంద‌నం చేయ‌టం క‌నిపిస్తోంది. ఏ స్వాములోరిని అయితే కేసీఆర్ పూజించారో.. ఇప్పుడ‌దే స్వాములోరిని న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేసిన తీరును గుర్తుకు తెస్తూ బ‌య‌ట‌కొచ్చిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కేసీఆర్‌.. తీరుపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.