Begin typing your search above and press return to search.

మీడియా మొఘ‌ల్ పై సారుకు కోపం త‌గ్గిపోయిన‌ట్లే!

By:  Tupaki Desk   |   16 May 2019 5:29 AM GMT
మీడియా మొఘ‌ల్ పై సారుకు కోపం త‌గ్గిపోయిన‌ట్లే!
X
అన‌వ‌స‌రంగా క‌ద‌లించుకోను. అవ‌స‌ర‌మైనా క‌దిలించుకోవ‌ద్ద‌న్న విష‌యాన్ని సూటిగా.. సుత్తి లేకుండా చెప్పే తీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంద‌ని చెబుతారు. ఈ మ‌ధ్య‌న ఒక ప్రాజెక్టు విష‌యంలో హైకోర్టులో జరిగిన విచార‌ణ‌.. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌ల్ని య‌థాత‌ధంగా ఒక ప్ర‌ముఖ మీడియా సంస్థ అచ్చేయ‌టం.. దానిపై కేసీఆర్ సారుకు వ‌చ్చిన ఆగ్ర‌హం అంతా ఇంతా కాద‌ని చెబుతారు.

దాన్ని క‌డుపులో దాచి పెట్టుకోకుండా త‌న మీడియాతో తీవ్ర‌స్థాయిలో త‌న వాద‌న‌ను చెప్పిన తీరు.. స‌ద‌రు మీడియా సంస్థ‌లో హాట్ టాపిక్ గా మారిన‌ట్లు చెబుతారు. దీంతో.. దిద్దుబాటు చ‌ర్య‌ల్ని యుద్ధ ప్రాతిప‌దిక‌గా తీసుకున్న స‌ద‌రు మీడియా సంస్థ తీరు కేసీఆర్ ను సంతృప్తి ప‌ర్చిన‌ట్లుగా చెబుతారు.

తాజాగా చోటు చేసుకున్న ఒక ప‌రిణామం విష‌యంలో కేసీఆర్ మీడియా ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిందే త‌ప్ప ఎక్క‌డా అత్యుత్సామాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని చెబుతారు. వాస్త‌వానికి తాజాగా చోటు చేసుకున్న భేటీ విష‌యంలో సంచ‌ల‌న క‌థ‌నాన్ని అల్లేందుకు అవ‌కాశం ఉన్నా.. అలాంటి వాటి జోలికి వెళ్ల‌కుండా.. త‌న ప‌ని తాను అన్నట్లుగా వ్య‌వ‌హ‌రించిన తీరుతో గులాబీ మీడియా త‌న స్టాండ్ ను క్లియ‌ర్ గా చెప్పేసిన‌ట్లుగా చెబుతున్నారు.

మా జోలికి మీరు రావొద్దు.. మీ జోలికి మేం రామ‌న్న సందేశాన్ని తాజా ఉదంతంలో తేల్చి చెప్పిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. మీడియా పెద్దాయ‌న విష‌యంలో కేసీఆర్ సారుకు వ‌చ్చిన కోపం త‌గ్గిన‌ట్లేన‌న్న విష‌యం తాజా ఉదంతాన్ని చూస్తే అర్థ‌మైన‌ట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అన‌వ‌స‌ర‌మైన విష‌యాల్ని అవ‌స‌రానికి మించిన కెలుకుడు ఎందుక‌న్న సారు మాట‌ను గులాబీ మీడియా తూచా త‌ప్ప‌కుండా ఫాలో అయిన‌ట్లుగా చెబుతున్నారు. త‌న‌ను టార్గెట్ చేసేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికి కెల‌క‌ని సారు తీరును మీడియా పెద్దాయ‌న త‌ప్ప‌నిస‌రిగా త‌న మైండ్ లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌టం ఖాయ‌మంటున్నారు.