Begin typing your search above and press return to search.

మోడీ క్లారిటీ ఇవ్వాల్సిన రీతిలో క్వశ్చన్ వేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   7 March 2020 5:30 PM GMT
మోడీ క్లారిటీ ఇవ్వాల్సిన రీతిలో క్వశ్చన్ వేసిన కేసీఆర్
X
జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు కాస్తా చట్టంగా మారటం.. దానిపై తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం కావటం తెలిసిందే. ఈ చట్టం కారణంగా సాధారణ ప్రజలు.. చదువుకోని వారికి చుక్కలు ఖాయమంటున్నారు. ఇక.. పేద.. బలహీన వర్గాలకు చెందిన పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న అనుమానాల్ని వ్యక్తమువుతున్నాయి. విపక్షాలు లేవనెత్తుతున్న క్వశ్చన్లకు ఆన్సర్ చేసినట్లుగా బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉన్నా.. వాస్తవంగా మోడీ సర్కారు తెచ్చిన చట్టం కారణంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న విషయాన్ని బల్లగుద్దినట్లుగా చెప్పటంలో మాత్రం వైఫల్యం చోటు చేసుకుందన్న మాట వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే.. సీఏఏ మీద వెల్లువెత్తుతున్న ఆందోళనలు అన్ని ఇన్ని కావు. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బరస్ట్ అయ్యారు. సీఏఏ.. ఎన్ పీఆర్ సీ మీద స్పందించిన కేసీఆర్.. ఊహించని రీతిలో కొత్త తరహా వ్యాఖ్యలు చేశారు. నూరుకు నూరు శాతం సీఏఏకు పన్ను కట్టటం ఖాయమన్నరు. ఇప్పటివరకూ తనకు సైతం బర్త్ సర్టిఫికేట్ లేదన్నారు. తన లాంటి వారికే బర్త్ సర్టిఫికేట్ లేనప్పుడు.. నిరుపేదలు.. దళితులు.. పాతబస్తీకి చెందిన వారికి ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

తనకు బర్త్ సర్టిఫికేట్ లేనప్పుడు.. మిగిలిన వారి సంగతిని అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే.. నూటికి నూరు శాతం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం పెడతానని స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు తన తండ్రిని తీసుకురమ్మంటే ఎలా అని ప్రశ్నించిన ఆయన వ్యాఖ్యలు ప్రధాని మోడీ మాష్టారు సమాధానం చెప్పాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాయని చెప్పాలి. కేసీఆర్ సూటిగా సంధించిన క్వశ్చన్ కు ప్రధాని మోడీ రియాక్ట్ అయితే కానీ.. సీఏఏ మీద లెక్క ఒక కొలిక్కి రావటం ఖాయమంటున్నారు. మరి.. అలా జరుగుతుందా? అన్నదే క్వశ్చన్.