Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ స్మారకం మీదంతా దుష్ర్పచారమే
By: Tupaki Desk | 22 April 2016 6:20 AM GMTఎన్టీవోడిగా తెలుగుప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడి మీద తనకున్న అభిమానాన్ని మరోసారి చాటి చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్టీఆర్ ను విపరీతంగా ఆరాధించే కేసీఆర్.. తన రాజకీయాన్ని తెలుగుదేశం పార్టీతోనే షురూ చేయటం మర్చిపోకూడదు. ఎన్టీఆర్ మీదున్న అభిమానంతో తన కుమారుడి పేరును కూడా తారక రామారావుగా పెట్టుకున్నట్లు పలువురు చెబుతుంటారు. అయితే.. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ స్మారక చిహ్నాన్ని చిన్నబోయేలా చేస్తూ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని అక్కడికి దగ్గర్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నదని.. కాలక్రమంలో ఎన్టీఆర్ స్మారక చిహ్నాం ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ పేరును మారుస్తారన్న ప్రచారం బలంగా సాగింది.
అయితే.. అలాంటి ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేసీఆర్ తేల్చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణి చిత్ర ప్రారంభోత్సవానికి హాజరైన కేసీఆర్.. ఈ విషయంపై స్పష్టత ఇస్తూ.. ‘‘ఎన్టీఆర్ గార్డెన్ మీద పలువురు దుష్ప్రచారం చేస్తున్నారు. తెలుగువాడి గుండెల్లో నిలిచిన మహానీయుడు ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు వెళ్లినా ఎన్టీఆర్ ను అభిమానించే వారు ఉంటారు. ఆయన తెలియని వారు ఉండరు. మద్రాసీలుగా పిలుచుకునే తెలుగు వారికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్. ఆయన స్మారక చిహ్నాన్ని చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని తేల్చి చెప్పారు