Begin typing your search above and press return to search.
జాతీయ రాజకీయాలా..వద్దే వద్దంటున్న కేసీఆర్
By: Tupaki Desk | 29 Dec 2017 2:30 PM GMTరాబోయే కాలంలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్రం తిప్పనున్నారని గత కొంతకాలంగా మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో అలాంటి సిగ్నల్స్ ఇచ్చారు. అయితే తాజాగా ఈ వార్తలు..ఇలాంటి సిగ్నల్స్ పై స్వయంగా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. అది కూడా ఓ బీజేపీ పెద్దాయనకు వెల్లడించారు. కేంద్ర రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వద్ద చెప్పినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
కోకాపేటలో గొల్ల - కుర్మల సంక్షేమ భవనాల సముదాయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ మధ్యలో ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశానని కేసీఆర్ చెప్పారు. `కేంద్ర రాజకీయాల్లో వచ్చే అవకాశం ఉందా? అని అడిగారు. కేంద్ర రాజకీయాలు నాకు ఇంట్రెస్ట్ లేదు. నా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో బతకాలన్నదే నా ఆకాంక్ష.నాకు కేంద్ర రాజకీయాలు వద్దు.. మీరే చేసుకోండి అని రాజ్ నాథ్ కు చెప్పాను`అంటూ సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని ఆయన పంచుకున్నారు. `రైతులకు ఎకరానికి రూ. 4 వేల చొప్పున సంవత్సరానికి రెండుసార్లు పెట్టుబడి ఇస్తున్నారని రాజ్ నాథ్ నన్ను అడిగారు. అవును ఇస్తున్నాం. సమైక్య రాష్ట్రంలో నష్టపోయామని గుర్తు చేశాను. మరి ఆ డబ్బు తిరిగి రైతులు ఎప్పుడు చెల్లిస్తారు` అని రాజ్ నాథ్ ప్రశ్నించారు. డబ్బు తిరిగి ఇచ్చేదేమీ లేదు. గవర్నమెంట్ ఫ్రీగా డబ్బు ఇస్తుందని చెప్పేసరికి రాజ్ నాథ్ కుర్చీ మీద నుంచి కిందపడిపోయేటట్లు చేసిండు అని సీఎం తెలిపారు.
కాగా, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. గొల్ల - కుర్మ జాతి అత్యధికంగా ఉన్న తెలంగాణ భారతదేశానికి దిక్సూచి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గొల్ల, కుర్మ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి ఈ రోజు ఘనంగా భూమి పూజ జరుపుకున్న సందర్భంలో ప్రతి ఒక్క గొల్ల - కుర్మ సోదరులందరికీ సీఎం కేసీఆర్ శుభాభివందనాలు తెలియజేశారు. `ఇల్లు అలకంగానే పండుగ కాదు. ఏదన్నా పట్టుకున్నామంటే గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తాం`అని సీఎం కేసీఆర్ అన్నారు. `మన వద్ద సంఘటిత శక్తి లేకనే అభివృద్ధిలో వెనుకబడిపోతున్నాం. ఆ బాధ పోవాలంటే మనలో ఐకమత్యం రావాలి. నేటి ప్రయాణంతో అద్భుతం జరగాలి. గొల్ల - కుర్మలలో ఎవరూ అనాథలుగా ఉన్న వారికి అన్నం దొరకాలి. తల్లిదండ్రులు లేని బిడ్డులున్నా.. వారి పెళ్లిళ్లు ఈ సంక్షేమ భవనంలో జరగాలి. గొల్ల - కుర్మల సంఘం నిధికి మూలధనం కింద బీసీ వెల్ ఫేర్ శాఖ నుంచి రూ. కోటి మంజూరు చేస్తున్నా. ఈ నిధి అద్భుతంగా మన జాతికి ఉపయోగపడుతుంది. సంక్షేమానికి దోహదపడుతుంది. ఈ మూలనిధి పెద్ద నిధిగా తయారు అవ్వాలి. విదేశాల్లోని ఎన్నారైలు కూడా కంట్రిబ్యూట్ చేయాలి. ఈ జాతి అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాం. గొల్ల - కుర్మల వారికే కాకుండా అన్ని కులాల కోసం పని చేస్తున్నాం. మూడున్నరేండ్ల పసి కూన అయినప్పటికీ.. దేశంలో అభివృద్ధిలో మన నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలో అసెంబ్లీలో సీఎం ఏ విధంగా చెప్పిండో.. ఆ విధంగా.. అద్భుతంగా గొర్రెల పిల్లల పెంపకం జరుగుతుందని వార్తలు చూశాను. ఇతర రాష్ర్టాల నుంచి 35 లక్షలు గొర్రెలు తెస్తే.. వాటికి 13 లక్షల పిల్లలు పుట్టాయి. మొత్తంగా 48 లక్షల గొర్రెలు తెలంగాణలో ఉన్నాయి. దీని ద్వారా కొన్ని వేల కోట్ల సంపదను యాదవులు సృష్టించబోతున్నారు. మూడు - నాలుగు సంవత్సరాలు దాటితే భారతదేశంలో అత్యంత ధనికులైన గొల్ల - కుర్మలు ఎక్కడా ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారనే రోజు వస్తుందన్నారు.
గొర్రెల యూనిట్ల పంపిణీకి కొలమానాలని సీఎం కేసీఆర్ చెప్పారు. `ఆయన గొల్ల కావాలి. కుర్మ కావాలి. 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి గొర్రెలు ఇవ్వాలని చెప్పాం. ఆ ప్రతిపాదికనే గొర్రెల పంపిణీ జరుగుతుందన్నారు. ఎన్ని లారీల గొర్రెలు దిగుమతి అవుతున్నాయో...అంతకు అంత ఎగుమతి చేసే రాష్ట్రంగా ఎదగాలని ఆనాడే చెప్పాను. 7 లక్షల 61 వేల మందికి గొర్రెల పంపిణీ కొనసాగుతుంది. మరో 5 వేల కోట్ల రూపాయాలు ఖర్చు అవుతంది. దీనికి వెనుకకు వెళ్లాం. సబ్సిడీ గొర్రెలు అమ్ముతున్నారు. పోలీసులు పట్టుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు పని జరగకుండా.. చూడాలి. ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకోవాలి` అని గొల్ల - కుర్మలకు సీఎం కేసీఆర్ సూచించారు.
`విదేశాల పర్యటనకు వెళ్లి మాంస ప్రాసెస్ యూనిట్లపై పరిశీలన జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సూచించాను. ఆయన త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్తారు. అర్బన్ కేంద్రంలో కూడా ఈ యూనిట్లు పెట్టాలి. దీనికి ప్రభుత్వం బీసీ వెల్ఫేర్ శాఖ నుంచి సబ్సిడీ కూడా ఇస్తుందన్నారు. ఈ అవకాశం గొల్ల - కుర్మ యువకులకే ఇస్తాం` అని సీఎం ప్రకటించారు.