Begin typing your search above and press return to search.

ఆమెతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన కేసీఆర్‌?

By:  Tupaki Desk   |   5 Jan 2018 6:26 AM GMT
ఆమెతో ప్ర‌త్యేకంగా మాట్లాడిన కేసీఆర్‌?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ లైంగిక వేధింపుల విష‌యంపై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న చ‌ర్చ అంతా ఇంతా కాదు. కుట్ర‌పూరితంగానే గ‌జ‌ల్‌ ను వేధిస్తున్నార‌ని.. త‌ప్పుడు కేసు పెట్టారంటూ వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఈ ఇష్యూపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ పేరును కూడా ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. గ‌జ‌ల్ అరెస్ట్ వెనుక ఆయ‌న మాట కూడా ఉంద‌న్న ఆరోప‌ణల్ని ప‌లువురు చూస్తున్నారు.

గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ అరెస్ట్ విష‌యంలో ముఖ్య‌మంత్రి క‌ల్పించుకోవాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న ప్ర‌శ్న‌లోనే స‌మాధానం ఉంద‌న్న మాటను ప‌లువురు చెబుతున్నారు. డ్ర‌గ్స్ కేసు మొద‌లు.. చాలా కేసుల్లో ఎలాంటి ఇబ్బందిని ఎదుర్కోని ప్ర‌ముఖులకు భిన్నంగా గ‌జ‌ల్ విష‌యంలో మాత్రం చ‌ట్టం అంత దూకుడుగా ఎలా ముందుకెళుతోంద‌న్న ప్ర‌శ్న‌ను సంధిస్తున్నారు.

గ‌జ‌ల్ లాంటి ప్ర‌ముఖుడి మీద వ‌చ్చిన ఆరోప‌ణ‌ల విష‌యంలో పోలీసులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ వినిపిస్తోంది. గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ త‌ప్పు చేయ‌లేద‌ని ఎవ‌రూ అన‌టం లేద‌ని.. కానీ.. మిగిలిన ప్ర‌ముఖుల ఉదంతాల్లో చోటు చేసుకున్న‌ట్లు కాకుండా.. చ‌ట్టం త‌న‌ప‌ని తాను చేసుకుంటూ పోవ‌టంలోనే అస‌లు విష‌యం ఉంద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో బ‌య‌ట‌కొచ్చిన వీడియోల గురించి ప్ర‌స్తావిస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన గ‌జ‌ల్ ప్రైవేటు వీడియో ఫుటేజ్ మొత్తాన్ని వ్యూహాత్మ‌కంగానే బ‌య‌టపెట్టిన‌ట్లుగా ప‌లువురు చెబుతున్నారు. కొన్ని శ‌క్తుల చొర‌వ‌తోనే గ‌జ‌ల్ వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గ‌జ‌ల్ ఎపిసోడ్‌ కు సంబంధించి కొత్త విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

గ‌జ‌ల్ బాధితురాలు కుమారితో.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేకంగా మాట్లాడిన‌ట్లు చెబుతున్నారు. ఆమె భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ధైర్యంగా త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి బ‌య‌ట‌కు చెప్ప‌టం త‌ప్పు కాద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ విష‌యాన్ని ఎవ‌రు క‌న్ఫ‌ర్మ్ చేయ‌టం లేదు. ఇంత‌కీ.. గ‌జ‌ల్ విష‌యంలో కేసీఆర్‌ కు అంత ఇంట్ర‌స్ట్ ఏమిట‌న్న ప‌లువుర సందేహాలకు స‌మాధానాన్ని వెతికితే ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం జ‌రిగిన ఉద్య‌మ వేళ‌లో కేసీఆర్ ను ఉద్దేశించి గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ ఘాటు వ్యాఖ్య‌లు చేశార‌ని.. దాని ఫ‌లితాన్ని తాజాగా అనుభ‌విస్తున్నార‌ని చెబుతున్నారు. త‌ప్పు చేసి అడ్డంగా దొరికిన గ‌జ‌ల్ విష‌యంలో చ‌ట్ట‌ప్ర‌కారం ఏం చేయాలో అదంతా చేయాల‌న్న స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చిన‌ట్లుగా స‌మాచారం.