Begin typing your search above and press return to search.

అశ్వత్థామకు కేసీఆర్ షాక్.. ఇక ఊస్టేనా?

By:  Tupaki Desk   |   3 Feb 2020 5:33 AM GMT
అశ్వత్థామకు కేసీఆర్ షాక్.. ఇక ఊస్టేనా?
X
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మెలో ‘అశ్వత్థామరెడ్డి’ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆర్టీసీ ఉద్యమాన్ని నడిపించింది ఆయనే.. తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుధీర్ఘ సమ్మెకు నాయకత్వం వహించారు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి. సమ్మె సమయంలో తెలంగాణలోని ప్రతిపక్షాలన్నింటిని ఏకం చేసి మద్దతు కూడగట్టారు. కేసీఆర్ కంట్లో నలుసుగా మారారు. ఏకంగా టీఆర్ఎస్ అనుబంధం సంఘంగా ఉంటూ కేసీఆర్ నే ఎదురించారు. దీంతో కేసీఆర్ సైతం ఉక్కుపాదం మోపారు.

52 రోజుల సుధీర్ఘమైన సమ్మె తర్వాత ఆర్టీసీ ఉద్యోగుల ఆర్తనాదాలు విని కేసీఆర్ సమ్మెకు ముగింపు పలికారు. తిరిగి వారందరికీ వరాలు కురిపించి ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. కానీ మొత్తం ప్రక్షాళన చేశారు. కార్మిక సంఘాలన్నింటిని రద్దు చేసి ఆ స్థానంలో కార్మికులతోనే సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు.

ఇక ఇన్నాల్లు కార్మికులను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయించిన కార్మిక సంఘాల నేతలకు కల్పిస్తున్న వెసులుబాట్లను ఆర్టీసీ రద్దు చేసింది. ఫలితంగా కార్మిక సంఘాల ప్రతినిధులంతా విధులకు హాజరుకావాల్సిన పరిస్థితి అనివార్యమైంది. అందరూ చేరినా ఉద్యమాన్ని నడిపించిన అశ్వత్థామ రెడ్డి మాత్రం ఉద్యోగంలో చేరలేదు. ఆయన డిసెంబర్ 6 నుంచి మే 5 వరకు సెలవు కావాలని దరఖాస్తు చేసుకోగా ఆర్టీసీ అధికారులు మంజూరు చేయలేదు.

దీంతో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్నారంటూ అశ్వాత్థామ రెడ్డికి ఆర్టీసీ తాజాగా షోకాజ్ మెమో జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎంజీబీఎస్ లో సీఆర్ఎం విభాగంలో ఏడీసీగా పనిచేస్తున్నారు

నోటీసుల పై అశ్వత్థామరెడ్డి స్పందించారు. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులపై కక్ష సాధింపులో భాగంగానే మెమో జారీ చేశారన్నారు. అశ్వత్థామరెడ్డి కనుక విధులకు హాజరు కాకపోతే ఇక ఆయన పోస్టు ఊస్ట్ గానే పరిగణించాల్సి ఉంటుంది. దీంతో కేసీఆర్ ను ఎదురించిన ఉద్యమ నాయకుడికి ఇప్పుడు ఉద్యోగమే లేకుండా చేస్తున్న గడ్డు పరిస్థితి ఎదురుకాబోతోంది.