Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కార్ షాక్

By:  Tupaki Desk   |   6 April 2021 5:54 AM GMT
వైఎస్ షర్మిలకు కేసీఆర్ సర్కార్ షాక్
X
తెలంగాణలో పార్టీ పెట్టాలని హుషారుగా ముందుకు వెళుతున్న వైఎస్ షర్మిల ముందరి కాళ్లకు పోలీసులు బంధం వేశారు. ఉత్సాహంగా పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిలకు ఇప్పుడు కరోనా వైరస్ తీవ్రత పెద్ద అడ్డంకిగా మారింది.దీంతో వైఎస్‌ షర్మిలకు ఊహించని షాక్‌ తగిలింది.

తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జీవో 68- 69 ప్రకారం షర్మిల సభకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు పోలీసులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. అయితే... నిబంధనలు పాటిస్తూ సభ జరుపుతామని షర్మిల బృందం పోలీసులను కలిసి వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

తెలంగాణలో పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్న వైఎస్ షర్మిల ఈ నెల 9న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా సభ నిర్వహణపై కరోనా దెబ్బ పడింది. ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్స్ లో సభకు షర్మిల బృందం ఇటీవల పోలీసుల నుంచి అనుమతి తీసుకుంది. ఇంతలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో పోలీసు శాఖ పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే పోలీసులు షర్మిల బృందానికి నోటీసులు జారీ చేశారు.

జీవో 68 - 69 ప్రకారం ఖమ్మం జిల్లా ఇన్ చార్జి లక్కినేని సుధీర్ కు నోటీసులు పంపారు. అయితే, కరోనా మార్గదర్శకాలు, అన్ని నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహిస్తామని షర్మిల బృందం పోలీసులకు బదులిచ్చినట్టు తెలుస్తోంది. కాగా, ఖమ్మం సభ ద్వారానే తన పార్టీ పేరు, గుర్తు ప్రకటించాలని షర్మిల భావిస్తున్నట్టు తెలిసింది. మరీ ఆమె సభకు అనుమతి వస్తుందా? లేదా అన్నది వేచిచూడాలి.