Begin typing your search above and press return to search.

ఎన్నిక‌ల‌కు అస్త్రాన్ని సిద్ధం చేసిన కేసీఆర్‌!

By:  Tupaki Desk   |   22 Jun 2018 5:30 PM GMT
ఎన్నిక‌ల‌కు అస్త్రాన్ని సిద్ధం చేసిన కేసీఆర్‌!
X
ముందుచూపుతోఅస్త్ర‌శ‌స్త్రాల్ని సిద్ధం చేయ‌టంలో కేసీఆర్ కు మంచి పేరుంది. సుదీర్ఘ‌కాలం ఉద్య‌మాన్ని న‌డిపిన ఆయ‌న‌కు క‌మాండో ఆప‌రేష‌న్ కంటే కూడా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేసేందుకే ఇష్ట‌ప‌డతారు. కేసీఆర్ ఉద్య‌మాన్ని నిశితంగా ప‌రిశీలిస్తే.. ఒక క్ర‌మ‌ప‌ద్ధతిలో ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్ల‌టం క‌నిపిస్తుంటుంది. ఎప్పుడైతే భావోద్వేగాలు పీక్స్ కు ట‌చ్ చేస్తాయో.. అప్పుడు కాస్తంత వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా ఉండ‌టం.. మ‌ళ్లీ ముందుకు అడుగులు వేయ‌టం చేసేవారు.

ఉద్య‌మాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు వ‌చ్చే గండాల్ని దాటుకుంటూ.. త‌న ల‌క్ష్య‌సాధ‌న దిశ‌గా అడుగులు వేసేవారు. అధికారం ఎప్ప‌టికైనా సాధ్య‌మే అన్న ఒకే ఒక్క న‌మ్మ‌కంతో భారీ ఉద్య‌మానికి తెర తీసిన కేసీఆర్.. ఆ ప్ర‌యాణంలో త‌న‌కు ఎదురైన చేదు అనుభ‌వాల‌కు బెదిరిపోలేదు. ఉద్య‌మాన్ని త‌ట్టి లేపిన త‌న‌పైనే విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు చేస్తున్న వేళ వ్యూహాత్మ‌కంగా వాటిని అధిగ‌మించేందుకు వీలుగా వ్యూహ‌ర‌చ‌న‌ను సిద్ధం చేసేవారు.

అలాంటి కేసీఆర్ చేతికి ప‌వ‌ర్ వ‌చ్చాక‌.. దాన్ని నిలుపుకునేందుకు ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని వేయ‌కుండా ఉంటారా? త‌న నాలుగేళ్ల పాల‌న‌లో ఫ‌స్ట్ ర్యాంగ్ రాకున్నా.. ప్ర‌జ‌ల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి పెరగ‌కుండా జాగ్ర‌త్త‌లు ప‌డ్డారు. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌టం ద్వారా తెలంగాణ సాధ‌న‌లో తాను చేసిన త్యాగాల‌కు త‌గిన ఫలితం ద‌క్కేలా చేయాల‌న్న ఆశ‌లో ఉన్నారు. ఇందులో భాగంగా రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఎన్నిక‌ల నినాదాన్ని ఫైన‌లైజ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

టార్గెట్ న‌వంబ‌ర్ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. ఒక‌వేళ తాను అంచ‌నా వేసిన‌ట్లుగా న‌వంబ‌రు.. డిసెంబ‌రుల‌లో ఎన్నిక‌లు జ‌రిగితే అందుకు త‌గ్గ‌ట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈసారి ఎన్నిక‌ల నినాదాన్ని సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. ఈసారి ఎన్నిక‌ల నినాదాన్ని భావోద్వేగాల్ని ట‌చ్ చేసేలా రూపొందించిన‌ట్లుగా తెలుస్తోంది.

అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణ‌ను సుసాధ్యం చేయ‌ట‌మే కాదు.. బంగారు తెలంగాణ సాధ‌న దిశ‌గా అడుగులు వేస్తున్న కేసీఆర్ తానిప్ప‌టివ‌ర‌కూ చేసింది.. ఇప్ప‌టి నుంచి చేయ‌బోయేది చెప్పే వీలుందంటున్నారు. కేసీఆర్ రుణం తీర్చుకుందామ‌నే నినాదంతో ముందుకు వెళ్లాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. క‌ష్ట‌సాధ్య‌మైన తెలంగాణ‌ను సాధించిన కేసీఆర్ రుణాన్ని తీర్చుకోవాల‌న్న కాన్సెప్ట్ ను జ‌నంలోకి తీసుకెళ‌తార‌ని చెబుతున్నారు.

త‌మ‌పై అక్క‌డ‌క్క‌డా కొన్ని వ‌ర్గాల వారీకి ఉన్న ప్ర‌తికూల‌త‌ను ప‌ట్టించుకోకుండా రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్ల‌టంతో పాటు.. ఇదే అంశాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ప్ర‌చారాన్ని షురూ చేసిన‌ట్లేన‌ని చెబుతున్నారు. తెలంగాణ తెచ్చిన దానికి మ‌రోసారి ఎన్నిక‌ల్లో ల‌బ్థి పొందేందుకు కేసీఆర్ అదిరే ప్లాన్ ను సిద్ధం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. గులాబీ పెద్ద‌మనిషి వ్యూహం ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క్ వుట్ అవుతుందో చూడాలి. .