Begin typing your search above and press return to search.

ఇవీ...కేసీఆర్ ఫ్యూచ‌ర్స్ ప్లాన్స్

By:  Tupaki Desk   |   24 Nov 2015 3:41 PM GMT
ఇవీ...కేసీఆర్ ఫ్యూచ‌ర్స్ ప్లాన్స్
X
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌లో దుమ్మురేపే విజ‌యం సాధించిన నేప‌థ్యంలో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ కోసం కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ క్ర‌మంలో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ త‌న కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించారు. తెరాస పార్టీ పది కాలాల పాటు ఉండవల్సిన అవసరం ఉందని అందుకోసం త‌గు ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం, పార్టీ కార్యాక‌ల‌పాల‌పై సుదీర్ఘంగా వివ‌రించారు.

2021 నాటికి కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నీళ్ల విషయంలో దశాబ్దాలుగా జరిగిన అన్యాయాన్ని ప్రాజెక్టు రీడిజైన్‌ ల ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఎస్సారెస్పీ కాలువ తవ్వితే ఇంతవరకు నీళ్లు రాలేదని... కల్వకుర్తి - భీమా - నెట్టెంపాడు దశాబ్దాలుగా పెండింగ్‌ లో ఉన్నాయని కేసీఆర్‌ గుర్తు చేశారు. రైతులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులను గాలికి వదిలేశాయని, అంతర్‌ రాష్ట్ర వివాదాలు సృష్టించేయని, తెరాస మీద అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. తెరాసకు మంచి పేరు రావొద్దన్నదే విపక్షాల ప్రయత్నమన్నారు. అయిన‌ప్ప‌టికీ తాము ప్రాజెక్టులే ల‌క్ష్యంగా కృషిచేస్తుమన్నారు. మిషన్‌ కాకతీయను అందరూ మెచ్చకుంటే...కమిషన్‌ కాకతీయ అని విమర్శిస్తున్నారని మండిప‌డటం ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

33 వేల కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం త‌మ‌దని చెప్పారు. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామ‌ని చెప్పారు. వచ్చే మార్చి తర్వాత పగటిపూట వ్యవసాయానికి కరెంటు ఉంటుందని ప్ర‌క‌టించారు. రెండునెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేస్తాం. గత ప్రభుత్వాలు ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం చేశాయని కేసీఆర్‌ తెలిపారు. పత్తి రైతు సమస్యలపై, అలాగే ఆశావర్కర్ల సమస్యలపై కేంద్రంతో పోరాడతామని కేసీఆర్ చెప్పారు. యూనివర్శిటీల వీసీల కోసం సెర్చ్‌ కమిటీ వేశామ‌ని ప్ర‌క‌టించారు.

జ‌ర్న‌లిస్టులు - హోంగార్డుల కోసం త్వ‌ర‌లో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను కేటాయించ‌నున్నాన‌ని ప్ర‌క‌టించారు. 1998 డీఎస్సీ వారికి ఉద్యోగాలు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. దీంతో పాటు ఆయా గ్రామాల అభివృద్ధికి కోసం త‌మ వ‌ద్ద ప్ర‌ణాళిక‌లు ఉన్నాయ‌ని వివ‌రించారు.