Begin typing your search above and press return to search.
కోట్లు పోయి ఈ లక్షలేంది కేసీఆర్
By: Tupaki Desk | 21 May 2016 4:02 AM GMTవరాల దేవుడిగా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఖర్చుకు అస్సలు వెనుకాడరన్న విషయం తెలిసేందే. చేతికి ఎముకే లేనట్లుగా ఆయన నిధుల వర్షం కురిపిస్తుంటారు. ఉద్యోగుల జీతాల పెంపు మొదలు.. తనను అతిధిగా పిలిపించిన వర్గాల వారి కోసం కోట్లాది రూపాయిలతో భవనాలు కట్టిస్తానని చెప్పటమే కాదు.. కొన్ని ప్రత్యేక దినోత్సవాల సందర్భంగా కోట్లకు కోట్ల నిధుల్ని విడుదల చేయాలని ఆదేశాలు ఇస్తుంటారు. ఇక.. తెలంగాణకు ప్రతీకల్లాంటి బతుకమ్మ లాంటి పర్వదినాల సందర్భంగా నిధుల ఖర్చు కోసం ఎంతెంత వెచ్చిస్తారో అందరికి తెలిసిందే.
అలాంటి కేసీఆర్ కు కోటి రూపాయిలు అన్నది చాలా చిన్నమాట. అలాంటి ఆయన తాజాగా చెప్పిన మాట వింటే షాక్ తినాల్సిందే. ఈసారి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తాని చెప్పిన ఆయన.. ప్రతి జిల్లాకు రూ.30 లక్షల చొప్పున నిధుల్ని ఈ కార్యక్రమం కోసం విడుదల చేస్తామన్నారు. జిల్లాకు రూ.30 లక్షల చొప్పున లెక్క చూస్తే తెలంగాణలో ఉన్న పది జిల్లాలకు కేసీఆర్ విడుదల చేస్తామంటున్ననిధులు కేవలంరూ.3కోట్లు మాత్రమే. చిన్న చిన్న కార్యక్రమాలకే కోటి రూపాయిలు విరాళం ఇచ్చేసే కేసీఆర్ లాంటి వ్యక్తి.. ఈదఫా అందుకు భిన్నంగా లక్షలకు పరిమితం చేయటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.
ప్రతి తెలంగాణవాదికి అసలుసిసలు పండగైన తెలంగాణ ఆవిర్బావ వేడుకల కోసం జిల్లాకు కోటి చొప్పున విడుదల చేసినా.. ఖర్చు రూ.10కోట్లు దాటదు. అలాంటిది రూ.30లక్షలకే పరిమితం కావటం ఆసక్తికరమని చెప్పాలి. పండగ ఖర్చుకు సంబంధించి నిధుల విడుదల విషయంలో కేసీఆర్ ది జాగ్రత్తా? లేక పీనాసితనమా? అయినా.. ఉన్నట్లుండి కేసీఆర్ లో ఈ మార్పేంటి చెప్మా..?