Begin typing your search above and press return to search.

రైతులకు వరాలు కురిపించిన కేసీఆర్

By:  Tupaki Desk   |   22 Feb 2019 1:19 PM GMT
రైతులకు వరాలు కురిపించిన కేసీఆర్
X
తెలంగాణలో రెండోసారి పాలన పగ్గాలు అందుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ఈ ఓట్ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రిమండలి గురువారమే ఆమోదం తెలిపింది.

కాగా గత ప్రభుత్వంలోనే రైతుల కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి తెలంగాణ కర్షకుల ఆదరాభిమానాలు పొందిన కేసీఆర్ ఇప్పుడు రెండోసారి అదికారం అందుకున్న తరువాత కూడా రైతులకే అగ్ర తాంబూలమిచ్చారు. తన తాజాగా బడ్జెట్లో రైతులకు సంబంధించి భారీ కేటాయింపులు చేయడమే కాకుండా కీలక నిర్ణయాలూ తీసుకున్నారు.

రైతు బంధుకు రూ.12 వేల కోట్లు కేటాయించిన కేసీఆర్ రైతులకు రుణమాఫీ కూడా చేస్తానని ప్రకటించారు. మొన్నిటి ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజైన 2018 డిపెంబరు 11కి ముందు రుణాలు తీసుకున్న రైతులందిరికీ రూ.లక్ష వరకు మాఫీ చేస్తానని ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించారు.

ఇక మొత్తంగా వ్యవసాయానికి రూ.20 వేల కోట్లు ... నీటిపారుదల రంగానికి రూ.22,500 కోట్లు కేటాయించారు. మరోవైపు రైతు బంధు కింద ఇచ్చే మొత్తం కూడా పెంచారు.

బడ్జెట్లో ఇతర కేటాయింపులు ఇలా..

వైద్య - ఆరోగ్యం: రూ.5536 కోట్లు
రైతుబంధు: రూ. 12 వేల కోట్లు
రైతు రుణమాఫీ: రూ. 6 వేల కోట్లు
రైతు బీమా: రూ. 650 కోట్లు. 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న రూ. లక్ష వరకు పంట రుణాలు మాఫీ
ఎంబీసీ కార్పొరేషన్‌: రూ. వెయ్యి కోట్లు
షెడ్యూల్ తెగల ప్రగతి నిధి: రూ. 9,827 కోట్లు
షెడ్యూలు కులాల ప్రగతి నిధి: రూ. 16,581 కోట్లు
మైనార్టీ సంక్షేమం: రూ. 2004 కోట్లు
కల్యాణలక్ష్మి - షాదీ ముబారక్: రూ. 1450 కోట్లు
నిరుద్యోగ భృతి: రూ. 1,810 కోట్లు
ఆసరా పింఛన్లు: రూ. 12,067 కోట్లు
ఈఎన్టీ - దంత పరీక్షలు: రూ. 5,536 కోట్లు
బియ్యం రాయితీ: రూ. 2,744 కోట్లు
పంచాయతీలకు రెండు ఆర్థిక సంఘాల నుంచి: రూ. 3,256 కోట్లు
500 జనాభా గల గ్రామానికి రూ. 8 లక్షల నిధులు
టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రూ. 1.41 లక్షల కోట్ల పెట్టుబడులు.