Begin typing your search above and press return to search.
కార్యకర్త కోరిక తీర్చిన కేసీఆర్
By: Tupaki Desk | 28 Aug 2021 11:01 AM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చింది దివంగత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు. అందుకే తన కుమారుడికి తారక రామారావు అని పేరును కేసీఆర్ ఎంతో ప్రేమతో పెట్టారు. అందులో అన్నగారిని చూసుకుంటున్నారు. కేటీఆర్ అన్నట్టుగానే తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు.
తాజాగా కరీంనగర్ పర్యటనలో సీఎం కేసీఆర్ ఓ విచిత్రమైన సందర్భంగా ఎదరైంది. ఓ టీఆర్ఎస్ నేత తన కుమారుడికి సైతం కేటీఆర్ అని పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ ను కోరారు. తన బిడ్డను కేసీఆర్ చేతిలో పెట్టాడు. దీంతో ఉబ్బితబ్బిబైన కేసీఆర్ వారి కోరిక తీర్చాడు.
కరీంనగర్ పర్యటనలో పాల్గొన్న కేసీఆర్ తాజాగా రామడుగు ఎంపీపీ కలిగేటి కవిత-లక్ష్మన్ ల కుమారుడికి ‘తారక రామారావు’ అనే నామకరణం చేశారు. తమ కుమారుడికి కేటీఆర్ అని పేరు పెట్టుకోాలని ఉందని.. అది కూడా కేసీఆర్ చేతులమీదుగా నామకరణం చేయించుకోవాలని ఆ దంపతులు ఉబలాటపడ్డారు. గత రెండు నెలలుగా కేసీఆర్ కోసం ఎదురుచూశారు. వారి కోరికను తెలుసుకున్న సీఎం కేసీఆర్ బిడ్డను చేతిలోకి తీసుకొని మరీ ‘తారక రామారావు’ అని నామకరణం చేశారు.
సీఎం కేసీఆర్ తన బిడ్డకు పేరు పెట్టడంపై రామడుగు ఎంపీపీ, నేతలు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక కేసీఆర్ కూడా ఈ ఘటనతో కాస్తు కులాసాగా కనిపించారు.