Begin typing your search above and press return to search.

మోడీ టీం లో కేసీయార్ ఫ్రెండ్...?

By:  Tupaki Desk   |   8 Jun 2023 8:00 AM GMT
మోడీ టీం లో కేసీయార్ ఫ్రెండ్...?
X
దక్షిణ భారతాన నరేంద్ర జాలాని కి మోడీ తెర తీస్తున్నారు. ఓటమి నుంచి వెంటనే తేరుకుని దెబ్బ తీయాలనుకోవడం వీరుడి లక్షణం. మోడీ కూడా అదే పని లో ఉన్నారు. కర్నాటక ఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయని ఆయన నిరాశ చెందడం లేదు. పోయిన చోట నుంచి వెతుక్కోవాలని గట్టిగా డిసైడ్ అయ్యారు.

అందుకోసం ఆయన జేడీఎస్ ని దువ్వుతున్నారు. కర్నాటకలో బీజేపీ తరువాత ఇరవై దాకా ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకున్న జేడీఎస్ ని ఆయన తన వైపున కు లాగే ప్రయత్నం చేస్తున్నారు. నిజాని కి కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే కింగ్ మేకర్ అయి ఆ మీదట కింగ్ అవుదామని జేడీఎస్ ఆశపడింది. అయితే అలాంటి ఉపద్రవాలు ఏవీ జరగకుండా ఫుల్ మెజారిటీ అది కూడా బంపర్ మెజారిటీ తో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది.

అయిదేళ్ల పాటు ఆ పార్టీ అధికారం లో ఉంటుంది. మరి ఈ అయిదేళ్ళూ జేడీఎస్ ని కాపాడుకోవడం అన్నది ఆ పార్టీకి అగ్ని పరీక్ష గానే ఉంది అని చెప్పాలి. కాంగ్రెస్ కి ఇపుడున్న పరిస్థితుల్లో జేడీఎస్ వైపు చూడాల్సిన అవసరం లేదు. దాంతో బీజేపీ పిలుపు ని అందుకుని ఆ దిశగా అడుగులు వేస్తోంది జేడీఎస్.

మరో ఏడాది లో లోక్ సభ ఎన్నికలు రానున్నాయి. దాంతో ఆ ఎన్నికల్లో సత్తా ఎంతో కొంత చాటుకుంటే పార్టీ బతి కి బట్ట కడుతుంది అన్నదే జేడీఎస్ ఆలోచన. లేకపోతే కాంగ్రెస్ వైపు గా వలసలు పార్టీ నుంచి స్టార్ట్ అవుతాయని, రానున్న రోజుల్లో పార్టీ కనుమరుగు అవుతుంది అన్న బెంగ కూడా ఉంది.

కాంగ్రెస్ లో డీకే శివ కుమార్ వక్కలింగ సామాజిక వర్గం వారు ఉన్నారు. ఆయన అట్రాక్షన్ కి జేడీఎస్ కకావికలు అవుతుంది అన్న ఆందోళన ఉంది. ఈ నేపధ్యంలో మరో జాతీయ పార్టీ బలమైన బీజేపీ అండను జేడీఎస్ అనివార్యంగా కోరుకుంటోంది. బీజేపీ తో కలసి కర్నాటక లో కాంగ్రెస్ తో పోరాటం చేయడాని కి రెడీ అవుతోంది.

అంగబలం అర్ధబలం రెండూ దండీగా ఉన్న బీజేపీ తో ఉంటే పార్టీని కూడా నడపడం తేలిక అవుతుంది అన్నదే జేడీఎస్ పెద్దల ఆలోచన గా ఉంది. బీజేపీ తో తమ చెలిమి విషయం లో మాజీ ప్రధాని దేవేగౌడా ఎక్కడా ఏమీ దాచుకోవడంలేదు. బీజేపీ ని ఓడించేందుకు విపక్షాలు కూటమిగా కట్టి చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని ఆయన తేల్చి చెబుతున్నారు.

విపక్షాలు కలయిక వట్టి మాట అంటూ ఆయన బీజేపీ పంచన చేరడానికి ఉత్సాహపడుతున్నారు. ఇక మాజీ సీఎం దేవేగౌడ కుమారుడు అయిన కుమారస్వామి కూడా బీజేపీ తో కలసి తాము ముందుకు సాగుతామని అంటున్నారు. 2024లో కర్నాటక లో జరిగే ఎన్నికల్లో బీజేపీ జేడీఎస్ పొత్తు పెట్టుకుంటాయని చర్చ సాగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్ కి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నాయి.

ఇక బీయారెస్ తో ఆ మధ్యదాక చేతులు కలిపి తిరిగిన జేడీఎస్ ఇపుడు బీజేపీ తో చెట్టాపట్టాలు వేయడానికి రెడీ అవడం అంటే రాజకీయంగా కీలకమైన పరిణామం అంటున్నారు. కుమారస్వామి ని తెలంగాణా ఎన్నికల్లో కూడా తమ వెంట తిప్పుకుని కేసీయార్ కి వ్యతిరేకంగా స్పీచులు ఇప్పించేందుకు బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే కేసీయార్ కూడా ఇపుడు కాంగ్రెస్ నే తెలంగాణా లో శత్రువుగా చూస్తున్నారు. బీజేపీ ని ఏమీ అనడంలేదు. అది వ్యూహమా లేక ముందస్తు ఏర్పాటా అన్నది తెలియడం లేదు. ఏది ఏమైనా తెలంగాణా ఎన్నికల తరువాత కేసీయార్ రాజకీయం కూడా మలుపు తిరుగుతుందా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతాని కి కేసీయార్ మిత్రుడు గా ఇన్నాళ్ళూ ఉన్న ఉన్న కుమారస్వామి ఇపుడు మోడీ టీం లో చేరడం మాత్రం షాకింగ్ పరిణామమే అంటున్నారు. అది కర్నాటక లో కాంగ్రెస్ కి ఇబ్బందిగానే ఉంటుంది అని అంటున్నారు.