Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఈమెయిల్ పాస్ వర్డ్ ఏంటి..?

By:  Tupaki Desk   |   9 Aug 2015 7:47 AM GMT
కేసీఆర్ ఈమెయిల్ పాస్ వర్డ్ ఏంటి..?
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చురుకైన వ్యక్తే కానీ టెక్నికల్ గా చాలా వీక్ అంటుంటారు.. ఆయన వద్ద ఉన్న టీంలోనూ టెక్నికల్ గా పెద్ద నిపుణులేమీ కాదని చెబుతుంటారు. కొద్ది నెలల కిందట కేసీఆర్ కోసం కొన్న అధునాతన బస్సులో సీడీ పెట్టి పాటలు వేయలేకపోయారు ఆయన సిబ్బంది... తాజాగా కేసీఆర్ కూడా ఓ విషయంలో ఇబ్బంది పడ్డారు. ఆయన తన ఈమెయిల్ పాస్ వర్డునే మర్చిపోయారట.

తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో ఒక ఈ మెయిల్ ఉండగా, సీఎం పేరుతో వ్యక్తిగత ఈ మెయిల్ ను కెసిఆర్ ముఖ్యమంత్రి బాద్యతలు తీసుకున్న తర్వాత ఓపెన్ చేశారు. ఆయనకు పాస్ వర్డ్.. ఐడి కూడా సమకూర్చారు.కాని ఆయన దానిని పెద్దగా వాడలేదట.కాని కొద్ది రోజుల క్రితం ప్రధాని కార్యాలయం నుంచి ఒక ముఖ్యమైన సమాచారం పంపినట్లు ఫోన్ వచ్చింది. నీతి అయోగ్ కు సంబందించిన సమాచారం కేసీఆర్ మెయిల్ కు పంపించి దానిపై ప్రతిస్పందన కోరింది కేంద్రం. దాంతో కెసిఆర్ తన వ్యక్తిగత ఈ మెయిల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు. కాని పాస్ వర్డ్ మర్చిపోవడంతో అది సాధ్యం కాలేదు. దాంతో సీనియర్ అదికారులు ఐటి అదికారులను రప్పించి మరో ఐడి క్రియేట్ చేసి ఈమెయిల్ పనిచేసేలా చేశారట.