Begin typing your search above and press return to search.

మీకోసం గెలుస్తాం...మాకోసం కాదు

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:40 PM GMT
మీకోసం గెలుస్తాం...మాకోసం కాదు
X
తెలంగాణ ముందస్తు ఎన్నికలలో తెలంగాన రాష్ట్ర సమితి ఓటమి పాలైతే ఎవరికి నష్టం..?.ఎవరికి లాభం..? ప్రజలు - ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయో తెలియదు గాని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు మాత్రం తామే గెలుస్తామని చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదీ ఆయన పాల్గొంటున్న ప్రచార సభలలో ప్రస్పుటంగా కనిపిస్తోంది. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు సభలలో కేసీఆర్ ప్రసంగించారు. ఈ సభలలో ఆయన మాట్లాడుతూ "ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓటమి పాలైతే ఏమౌతుంది నాకేం కాదు...గెలిస్తే ప్రజలకు సేవ చేస్తా...ఓడిపోతే ఇంటికి పోయి పంట" అని కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన ఆయనకు ముందస్తు ఎన్నికలలో రానున్న విజయంపై నమ్మకంగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమి పేరుతో ఏకమయ్యాయి. అయితే సీట్ల సర్దుబాటు - అభ్యర్దుల ప్రకటన వంటి అంశాలలో మహాకూటమి తీవ్ర జాప్యం చేసింది. ఇదీ అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ఉపకరిస్తుందని - ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

ఈ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇది ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర రావు నుంచి క్రింది స్దాయి కార్యకర్త వరకూ నమ్మకంగా ఉన్నారు. తెలంగాణలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి పటిష్టంగా ఉందని 80 నియోజకవర్గాలకు పైగా తామూ విజయం సాధిస్తామని విశ్వసిస్తున్నారు. ఈ నమ్మకమే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గురువారం పాల్గొన్న సభలో చేసిన వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విజయం తనకంటే - పార్టీకంటే ప్రజలకే అవసరమనే అర్దంలో కేసీఆర్ ప్రకటించారు. ఇందులో భాగంగానే "నేను ఓడిపోతే ఏమైతాది. నాకేంగాదు హాయిగా ఇంట్లకి పోయి రెస్ట్ తీసుకుంటాను. తెరాసా ఓడిపోతే ఎవరికి నష్టమో మీరే ఆలోచించండి." అని ప్రకటించారు. ఇది ఆయన నమ్మకాన్ని తెలియజేస్తోందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.