Begin typing your search above and press return to search.
వైఎస్ వ్యూహాన్నే అమలు చేస్తున్న కేసీఆర్
By: Tupaki Desk | 2 Jan 2016 5:49 AM GMTదివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యూహాలు చాలా లోతుగా ఉంటాయి. ఆయన వేసే అడుగుల్ని క్షుణ్ణంగా చూస్తే కానీ..ఆయన కోణం సరిగా అర్థం కాని పరిస్థితి. సంక్షేమ కార్యక్రమాల్నిఒక క్రమపద్ధతిలో అమలు చేస్తూ పోవటమే కాదు.. వాటి ద్వారా లబ్ధి ఎలా పొందాలో వైఎస్ కు తెలిసినంత బాగా మరే నేతకు తెలీదేమో. అలాంటి లక్షణాల్నే పొణికి పుచ్చుకున్నట్లు కనిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
సంక్షేమ పథకాల్ని ఓటుబ్యాంకుగా మార్చుకోవటంపై వైఎస్ ఏ రీతిలో అయితే లెక్కలు కట్టి గురి పెట్టారో.. తాజాగా గ్రేటర్ పీఠాన్ని దక్కించుకోవటం కోసం అలాంటి ఫార్ములానే అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో నాటి ఉమ్మడి రాష్ట్రంలో మహాకూటమి పేరిట తెలుగుదేశం.. టీఆర్ ఎస్ సహా పెద్దపార్టీలన్నీ ఒక జట్టుగా కడితే.. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగటం.. అందరి అంచనాల్ని వమ్ము చేస్తూ ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించటం పలువురిని విస్మయానికి గురి చేసింది.
2009 ఎన్నికల నాటి ఫలితాలకు సంబంధించి ఎన్నికలు జరగటానికి దాదాపు రెండు.. మూడు నెలలకు ముందే.. కొందరితో వైఎస్ ప్రత్యేకంగా సమావేశం అయ్యేవారు. ఎన్నికలు ఎలా జరిగే అవకాశం ఉందని.. పార్టీకి వచ్చే సీట్ల గురించి ఆయన లెక్కలు అడిగేవారు. ఎవరికి తోచినట్లుగా వారు చెప్పేవారు. అందరూ అంతిమ విజయం మీద అనుమానాలు.. సందేహాలు వ్యక్తం చేసేవారు. అయితే.. వైఎస్ మాత్రం కూల్ గా కనిపించేవారు. విజయం మీద ధీమా వ్యక్తం చేసేవారు. ఇంతపెద్ద ఎత్తున విమర్శలు.. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. విజయం ఎలా సాధ్యమవుతుందన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తే.. ‘‘మనం చేసిన పనులే మనల్ని గెలిపిస్తాయ్ లేవయ్యా’’ అని చెప్పేవారట.
చాలామందికి వైఎస్ మాటల్లోని మర్మం తెలీక కిందామీదా పడే వారు. తన హయాంలో అమలు చేసిన ఫించన్ల పథకం.. ఆరోగ్య శ్రీ.. 108 సేవలు.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిన నిధులు.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు.. ఫీజు రీయింబర్స్ మెంట్ లాంటి పథకాల లబ్థిదారులు తన వెంట పక్కాగా ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసేవారు. దీనికి తగ్గట్లే 2009 ఫలితాలు ఎలా వచ్చాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
నాడు వైఎస్ అనుసరించిన వ్యూహాన్నే నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తుండటం విశేషం. ముంచుకొస్తున్న గ్రేటర్ ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఆయన.. గ్రేటర్ పరిధిలోని ఓటర్ల మనసు దోచుకోవటానికి ఆయన వినూత్న కార్యక్రమాల్ని ఒకటి తర్వాత ఒకటిగా ప్రకటిస్తున్నారు. వరుస ఉద్యోగ ప్రకటనలతో పాటు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ దిశగా ప్రయత్నాలు షురూ కావటంతో పాటు.. ఇంటిపన్ను తగ్గింపు విషయంలో అంతులేని ఉదారతను ప్రదర్శిస్తున్న వైనం కనిపిస్తుంది. మిగిలిన హామీల ద్వారా ప్రయోజనం పొందేవారి సంఖ్యను పక్కన పెట్టి.. ఇంటిపన్ను విషయంలో పెద్ద ఎత్తున రాయితీ ఇచ్చిన దానికి గ్రేటర్ పరిధిలో 5.09 లక్షల మంది నేరుగా ప్రయోజనం పొందే వీలుంది. కుటుంబానికి ఇద్దరు చొప్పున.. వారికి తెలిసిన వారిలో ఒక్క ఓటు లెక్కేసినా.. ఒక్క ఆస్తిపన్ను చెల్లింపు తగ్గింపు కారణంగా 15లక్షల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇంటిపన్ను చెల్లించే వారు 13.5లక్షల మంది ఉంటే.. వారిలో 5.09లక్షల మంది తాజాగా ప్రకటించిన రూ.101 ఇంటి పన్ను కడితే సరిపోనుంది. ఇప్పటివరకూ వారు ఏడాదికి రూ.1200 చొప్పున చెల్లిస్తున్నారు.
తాము అడగకుండానే ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ కు గ్రేటర్ ఇంటి యజమానులు తమ విధేయతను ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక నిర్ణయానికే 15 లక్షల మంది ప్రభావితం అయితే.. మిగిలిన వరాలకు అదే రీతిలో స్పందన వచ్చే అవకాశం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. వైఎస్ ఏ విధంగా అయితే పథకాలతో ప్రజల్ని విభజించి.. వివిధ వర్గాల వారిని తన ఓట్ బ్యాంకుగా మార్చుకున్నారో.. అదే వ్యూహాన్ని తాజాగా కేసీఆర్ అనుసరిస్తున్నారని చెప్పక తప్పదు.