Begin typing your search above and press return to search.
గంటా...జేడీ...కేసీయార్ కి ఎందుకు గుర్తొస్తున్నారు....?
By: Tupaki Desk | 3 Feb 2023 9:02 AM GMTకేసీయార్ తెలంగాణా సీఎం. అయినా అవిభాజ్య ఆంధ్ర ప్రదేశ్ లో ఆయన తెలుగుదేశంలో ఉన్నారు. కొంతకాలం మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం నాయకులు అందరితో ప్రాంతాల తేడా లేకుండా ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లోనే ఏపీ నాయకులు అంతా ఉంటారు. ఆ విధంగా కేసీయార్ తో సాన్నిహిత్యం ఉంది. ఈ నేపధ్యంలో చూసుకుంటే సడెన్ గా తన టీయారెస్ పార్టీని బీయారెస్ గా కేసీయార్ మార్చేశారు.
దాంతో ఆయన ఫుల్ ఫోకస్ ఏపీ మీద పెట్టేశారు. ప్రత్యేకించి ఆయన ఒక బలమైన సామాజికవర్గం ఒక బలామైన ప్రాంతం మీద దృష్టి పెట్టారు. ఏపీలో కాపులు సాలిడ్ గా ఉన్న్నారు. వారి ఓటు బ్యాంక్ తోనే ఎవరైనా ముఖ్యమంత్రి పీఠాలు ఎక్కేది. కానీ ఆ కాపులకు మాత్రం ఆ పీఠం అందని పండుగా ఉంది.
ఈ నేపధ్యంలో పవన్ జనసేన పెట్టి తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇపుడు మరో పార్టీ కాపుల కోసమే అంటోంది. అదే బీయారెస్. దానికి ఏపీ ప్రెసిడెంట్ గా తోట చంద్రశేఖర్ ని తీసుకున్నారు. జనసేనలో ఉన్న బలమైన నాయకులు కొందరిని కేసీయార్ తీసుకున్నారు. అయితే బిగ్ షాట్స్ మీద ఆయన గురి పెట్టారని అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర నాందేడ్ సభ మీద చూపు సారించిన కేసీయార్ అది అయిన తరువాత విశాఖలోనే బీయారెస్ సభ పెట్టాలని చూస్తున్నారు.
విశాఖ సభ అంటే అదిరిపోయే రేంజిలో ఉండాలి. దాని కోసం ఆయన భారీ స్కెచ్ గీశారని అంటున్నారు. విశాఖ వేదికగా రాజకీయాలు చేస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ మీద గురి పెట్ట్టార్ని తెలుసోంది. ఇందులో చూస్తే గంటా శ్రీనివాసరావు ప్రస్తుతం తెలుగుదేశంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకుంటున్నారు.
అయితే ఆయన్ని బీయారెస్ లోకి తీసుకురావాలని అపుడే ఏపీలో తమ పార్టీ వేళ్ళూనుకుంటుందని కేసీయార్ భావిస్తున్నారని అంటున్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ 2019లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓడారు. ఈసారి తప్పనిసరిగా విశాఖ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన చూస్తున్నారు. పార్టీ కోసం వెతుకుతున్నారు. సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే బీయారెస్ నేతలు పట్టుకున్నారు.
ఈ మధ్యనే తలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆయంతో ఫోన్లో మాట్లాడారు అని అంటున్నారు. తమ పార్టీలోకి చేరాలని బిగ్ ఇన్విటేషన్ ఇచ్చారని చెబుతున్నారు. అయితే తాను బీయారెస్ లో చేరేదాని మీద అయితే జేడీ ఎలాంటి హామీ అయితే ఇప్పటిదాకా ఇవ్వలేదు అని అంటున్నారు.
ఈ నేపధ్యంలో విశాఖలో ఒక కార్యక్రమం కోసం వచ్చిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు జేడీ లక్ష్మీనారాయణను కలిశారు అని అంటున్నారు. ఈ ఇద్దరు నేతలతో ఆయన బీయారెస్ లో చేరే విషయం మాట్లాడారు అని అంటున్నారు. ఎలాగైనా ఈ ఇద్దరు నేతలను తమ పార్టీలోకి రప్పించాలని కేసీయార్ చూస్తున్నారు అని అంటున్నారు
ఈ ఇద్దరు కీలక నేతలు వస్తే కనుక బీయారెస్ కి ఇక ఏపీలో తిరుగులేదని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారని భోగట్టా. దీని కంటే ముందు ఏపీ బీయారెస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ హైదరాబాద్ లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కన్నా లక్ష్మీనారాయణతో సహా గంటా, జేడీలని పిలిచి ముచ్చట్లు పెట్టారు. మరి ఆయన కూడా బీయారెస్ లో చేరమనే ఆహ్వానించారని అంటున్నారు. మరి ఈ ఇద్దరు నేతల మదిలో ఏముందో తెలియదు కానీ కేసీయార్ అయితే పదే పదే ఈ ఇద్దరినీ తలచుకుంటున్నారు అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.