Begin typing your search above and press return to search.
సచివాలయం అయిపోయింది ఇప్పుడు కొత్త అసెంబ్లీ మీద సారు ఫోకస్?
By: Tupaki Desk | 1 Jun 2023 3:00 PM GMTకొత్త ఒక వింత.. పాత ఒక రోత అన్న సామెతకు తగ్గట్లే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చూస్తుంటే. సుబ్బరంగా ఉన్న నిర్మాణాలకు బదులుగా వేలాది కోట్లు ఖర్చు పెట్టేసి భారీ.. ఖరీదైన భవనాల్ని నిర్మించటం.. ఏర్పాటు చేయటం మీద ఆయనకున్న ఆసక్తి అంతా ఇంతా కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ ధోరణిని ఆయన దాచుకోలేదు. తొలుత ముఖ్యమంత్రి అధికార నివాసం మీద ఫోకస్ చేసిన ఆయన.. తన అభిరుచికి తగ్గట్లు.. ప్రగతి భవన్ ను నిర్మించుకోవటం తెలిసిందే. అందుకోసం పెట్టిన ఖర్చు లెక్క తెలిసిందే.
ఇదిలా ఉండగా.. మరోపాతిక నుంచి నలభై ఏళ్ల వరకు నడిచే అవకాశం ఉన్నప్పటికీ.. కాదని మొత్తంగా కూల్చేసి.. దాని స్థానే భారీ ఖర్చుతో కొత్త సెక్రటేరియట్ ను ఏర్పాటు చేయటం తెలిసిందే. నమ్మకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కేసీఆర్ కు పాత సెక్రటేరియట్ వాస్తు మీద ఉన్న సందేహాలు..దాని ఆయువు తీరేలా చేసిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. గత ముఖ్యమంత్రులు.. సెక్రటేరియట్.. ముఖ్యమంత్రి అధికారిక నివాసాల కోసం హంగుల కోసం ఖర్చులు చేసే వారే తప్పించి.. మొత్తంగా కొత్త భవనాలు కట్టించుకోవాలన్న ధైర్యసాహసాలు చేసింది లేదు. ఆ విషయంలో మిగిలిన సీఎంల (ఉమ్మడి రాష్ట్ర ముఖ్య మంత్రులతో పోలిస్తే) కంటే ఆయన చాలా ముందుంటారు.
కొత్త సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ఆయన సెక్రటేరియట్ కు రావటం మొదలుపెట్టినట్లుగా చెబుతున్నారు. దీనికి తగ్గట్లే.. చాలా సమీక్షలు కొత్త సెక్రటేరియట్ లో జరగటం తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ ఫోకస్.. కొత్త అసెంబ్లీ భవనం మీద పడినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న అసెంబ్లీ తన అభిరుచికి అనుగుణంగా లేకపోవటంతో.. తన అభిరుచికి అద్దం పట్టేలా కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
దీనికి సంబంధించిన అనువైన స్థలం కోసం అధికారులు వెతుకుతున్నట్లు చెబుతున్నారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి రోడ్డులోని పాటిగడ్డలో ఉన్న 40 ఎకరాల భూమి కానీ.. ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ప్రస్తుతం నిరుపయోగంగా ఉందని.. ఆ ప్రాంగణంలో 17 ఎకరాలు అందుబాటులో ఉన్నందున.. అక్కడ అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. నిజానికి కొత్త అసెంబ్లీ భవనం మీద కేసీఆర్ కు ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. గతంలో దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసినా.. అవేమీ ముందుకు వెళ్లలేదు.
2019లో అసెంబ్లీ కొత్త భవన నిర్మాణానికి ఎర్ర మంజిల్ ప్యాలెస్ స్థానంలో చేయాలని చూసినా.. తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో తగ్గారు. నిజానికి అక్కడ భూమి పూజ కూడా జరగటాన్ని మర్చిపోకూడదు. ఎర్రమంజిల్ భవనం వారసత్వ కట్టటం కావటం.. అద్భుతమైన నిర్మాణ శైలితో కూడుకున్నది కావటంతో దాన్ని కూల్చాలన్న నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరు కోర్టును కూడా ఆశ్రయించటంతో.. కొత్త అసెంబ్లీ నిర్మాణం అక్కడ ఆగిపోయింది.
అనంతరం పబ్లిక్ గార్డెన్స్ మీద ఫోకస్ చేసినా.. అక్కడున్న భారీ చెట్లను కూల్చేసి వస్తే వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో దాన్ని పక్కన పెట్టేశారు. మొత్తంగా కొత్త అసెంబ్లీ భవన నిర్మాణం మీద ప్రత్యేక ఆసక్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. రాజు తలుచుకుంటే కొత్త భవనాలు రాకుండా ఉంటాయా?